గుంతలు, స్పీడ్ బ్రేకర్లు ఉంటే అలెర్ట్ చేస్తాయి ఈ ఏథర్ ఎలక్ట్రికల్ స్కూటర్లు
ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన 450X, 450 ఎపెక్స్, రిజ్తా Z స్కూటర్లలో 'పాట్‌హోల్+ అలర్ట్స్' (Pothole+ Alerts) అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రోడ్లపై ఉన్న గుంతలు, స్పీడ్ బ్రేకర్లు, దెబ్బతిన్న రోడ్ల గురించి ఈ ఫీచర్ ముందే రైడర్లను అప్రమత్తం చేస్తుంది.
భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన వినియోగదారుల కోసం అత్యంత ఉపయోగకరమైన సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది తమ 'కమ్యూనిటీ డే'లో ప్రదర్శించిన 'పాట్‌హోల్+ అలర్ట్స్' (Pothole+ Alerts) ఫీచర్‌ను అధికారికంగా రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది.

ఏథర్ జెన్-2 (Gen 2) అలాగే ఆ తర్వాత వచ్చిన 450X, 450 ఎపెక్స్ (450 Apex), రిజ్తా Z (Rizta Z) ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
9 ఏళ్ల పరిశోధన.. 'ఫ్రీట్ ఇంటెలిజెన్స్' ఆధారంగా..
ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేయడానికి దాదాపు 9 సంవత్సరాలు పట్టిందని ఏథర్ తెలిపింది. రోడ్డు ప్రమాదాలు, గుంతలను గుర్తించేందుకు ఏథర్ తన కనెక్టెడ్ స్కూటర్ల నెట్‌వర్క్ ద్వారా బిలియన్ల కొద్దీ కిలోమీటర్ల రైడింగ్ డేటాను విశ్లేషించింది. ప్రతి ఏథర్ స్కూటర్‌లో ఉండే ఆన్‌బోర్డ్ కంప్యూటింగ్, కనెక్టివిటీ వ్యవస్థ ద్వారా రోడ్డు పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరించి ఈ 'ఫ్రీట్ ఇంటెలిజెన్స్' వ్యవస్థను రూపొందించారు.
రియల్ టైమ్ హెచ్చరికలు ఎలా పనిచేస్తాయి?
రైడర్లు తమ స్కూటర్ డాష్‌బోర్డ్‌లో నావిగేషన్ ఉపయోగిస్తున్నప్పుడు, ముందుకు వెళ్లే మార్గంలో ఉన్న గుంతలు (Potholes), దెబ్బతిన్న రోడ్లు, అశాస్త్రీయంగా నిర్మించిన స్పీడ్ బ్రేకర్ల గురించి సిస్టమ్ ముందుగానే హెచ్చరిస్తుంది.
డాష్‌బోర్డ్ డిస్‌ప్లే: స్కూటర్ డిజిటల్ స్క్రీన్‌పై హెచ్చరికలు కనిపిస్తాయి.
ఆడియో అలర్ట్స్: 'ఏథర్ హాలో' (Ather Halo) స్మార్ట్ హెల్మెట్ లేదా బ్లూటూత్ హెడ్‌సెట్ ఉపయోగిస్తున్న రైడర్లకు నేరుగా చెవిలోనే ఆడియో రూపంలో ముందస్తు హెచ్చరికలు వినిపిస్తాయి. దీనివల్ల దృష్టి రోడ్డుపై నుంచి పక్కకు మల్లకుండా సురక్షితంగా ప్రయాణించవచ్చు.
భవిష్యత్తు ప్రణాళికలు: 'స్మూతెస్ట్ రూట్' ఎంపిక
ప్రస్తుతం కేవలం గుంతల గురించి హెచ్చరించడమే కాకుండా, భవిష్యత్తులో నావిగేషన్‌ను మరింత సమర్థవంతంగా మార్చాలని ఏథర్ భావిస్తోంది. త్వరలోనే వేగవంతమైన మార్గం (Fastest Route)తో పాటు దెబ్బతిన్న రోడ్లు లేని సులభమైన మార్గం (Smoothest Route) ని ఎంచుకునేలా నావిగేషన్ ఆప్షన్‌ను అందించేందుకు ఏథర్ కసరత్తు చేస్తోంది.
కనెక్టెడ్ వెహికల్ ఈకోసిస్టమ్‌లో పాట్‌హోల్ అలర్ట్స్ అనేది కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో డేటా ఆధారిత మరిన్ని ఫీచర్లను తీసుకొస్తామని ఏథర్ స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


