...
...
Next Story

తెలంగాణ ప్రజలకు సంక్రాంతి కానుక.. షాపింగ్, గోల్డ్, ఫుడ్​పై ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆఫర్లు!

సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ వినియోగదారుల కోసం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, జ్యువెలరీ, ప్రయాణాలపై భారీ డిస్కౌంట్లను అందిస్తూ పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 9, 2026, 12:20:46 IST
Advertisement

ఇంకొన్ని రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటనున్నాయి. గాలిపటాల సందడి, భోగి మంటలు, పిండి వంటల ఘుమఘుమలతో ఇళ్లు కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పండుగ సంతోషాన్ని మరింత పెంచుతూ.. దేశంలోనే అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయిన 'ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్' తన కస్టమర్ల కోసం ప్రత్యేక పండుగ ఆఫర్లను తీసుకొచ్చింది.

ఏయూ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​ బంపర్​ ఆఫర్లు..
ఏయూ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​ బంపర్​ ఆఫర్లు..

యూనివర్సల్ బ్యాంక్‌గా మారేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి సూత్రప్రాయ అనుమతి పొందిన ఈ బ్యాంక్.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లకు షాపింగ్, ఎలక్ట్రానిక్స్, ప్రయాణాలు, డైనింగ్, వినోదం వంటి అనేక విభాగాల్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

తెలంగాణ కస్టమర్ల కోసం ప్రత్యేక పండుగ ఆఫర్లు..

ఫ్యాషన్ అండ్​ గ్రాసరీ: అజియో (AJIO)లో 10% తగ్గింపు, స్పైకర్​లో నేరుగా రూ. 750 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌లో రూ. 500 వరకు, ఇన్‌స్టామార్ట్ ద్వారా కిరాణా సామాగ్రిపై రూ. 111 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఎలక్ట్రానిక్స్: క్రోమాలో మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుపై రూ. 10,000 వరకు భారీ తగ్గింపును బ్యాంక్ అందిస్తోంది.

ప్రయాణాలు: పండుగకు సొంతూర్లకు వెళ్లే వారి కోసం ఈజ్‌మైట్రిప్, మేక్‌మైట్రిప్, పేటీఎం ఫ్లైట్స్, యాత్ర వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఫ్లైట్ బుకింగ్స్ చేస్తే రూ. 10,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అభిబస్​లో బస్సు టికెట్లపై 10% తగ్గింపు ఉంది.

వినోదం అండ్​ ఆహారం: జొమాటో, స్విగ్గీలలో ఆర్డర్ చేస్తే 20% వరకు తగ్గింపు లభిస్తుంది. బుక్‌మైషో ద్వారా సినిమా టికెట్లపై 50% వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.

"తెలంగాణ కుటుంబాలకు సంక్రాంతి అనేది కొత్త ఆశలకు, ఉత్సాహానికి చిహ్నం. మా కస్టమర్ల పండుగ ఖర్చులను మరింత లాభదాయకంగా మార్చేందుకు ఈ ఆఫర్లను తీసుకురావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. యూనివర్సల్ బ్యాంక్‌గా ఎదుగుతున్న ఈ తరుణంలో, కేవలం బ్యాంకింగ్ సేవలే కాకుండా కస్టమర్లతో లోతైన బంధాన్ని ఏర్పరచుకోవడమే మా లక్ష్యం," అని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ సీఈఓ ఉత్తమ్ తిబ్రేవాల్ పేర్కొన్నారు.

ఈ ఆఫర్లు సంక్రాంతి పండుగ సమయంలో పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన ఏయూ క్రెడిట్, డెబిట్ కార్డులపై ఇవి వర్తిస్తాయి.

పూర్తి వివరాల కోసం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (offers.au.bank.in) లేదా AU 0101 యాప్‌ను సందర్శించవచ్చు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. క్రెడిట్​ కార్డు వినియోగం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe