తెలంగాణ సంక్రాంతి సెలవులు 2026 : స్కూల్స్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలపై అప్డేట్
తెలంగాణ ప్రభుత్వం 2026 సంక్రాంతి సెలవులు ప్రకటించింది. పాఠశాలలు తిరిగి జనవరి 17వ తేదీన తెరుచుకుంటాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంక్రాంతి పండుగ సెలవులను అధికారికంగా ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, వాణిజ్య పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొంది ప్రభుత్వం. జనవరి 16వ తేదీన కనుమ రోజును పురస్కరించుకుని ఆప్షన్ హాలీడే ప్రకటించింది. ఈరోజును రైతులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు.

జనవరి 17వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు తిరిగి పారంభం అవుతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక హాస్టళ్లలో చదవుతున్న విద్యార్థులు ఇప్పటి నుంచే ఇంటికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తేదీలు తెలియడంతో ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక కాలేజీల విషయానికొస్తే.. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన విద్యా క్యాలెండర్ ప్రకారం.. ఇంటర్ విద్యార్థులకు జనవరి 11 నుండి జనవరి 18 వరకు అధికారిక సెలవులు షెడ్యూల్ చేశారు. జనవరి 10 రెండో శనివారం నాడు వస్తుంది.. విద్యార్థులకు కలిసి వస్తుంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు, సెలవుల జాబితా తక్కువగా ఉంటుంది. జనవరి 14 (సంక్రాంతి), జనవరి 15 (భోగీ)లకు మాత్రమే అధికారిక సెలవులు ప్రకటిస్తారు. అయితే జనవరి 10, 11 తేదీలలో సాధారణ సెలవులు కలిసి వస్తాయి.
జేఎన్‌టీయూ హైదరాబాద్ పరిధిలోని ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంకా స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులకు సంబంధించిన నిరసనల కారణంగా ఇటీవల ఏర్పడిన అంతరాయాలు ఇప్పటికే విద్యా షెడ్యూల్‌లను ఆలస్యం చేశాయి. సిలబస్‌లో కొన్ని భాగాలు ఇంకా పూర్తి కాకపోవడంతో కళాశాలలు మరింత విద్యాపరమైన ఆలస్యం జరగకుండా సెలవులను పరిమితం చేయవచ్చు.
ఏపీ సంక్రాంతి సెలవులు
ఇక ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు సంక్రాంతి సెలవులు భారీగా వస్తున్నాయి. ఏకంగా 9 రోజులపాటు కలిసి వస్తున్నాయి హాలీడేస్. ఇటీవలే ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ఖరారు చేసింది. జనవరి 10వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ దాకా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి పండుగ తేదీలు ఇవి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. జనవరి 19వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


