ఈ సంవత్సరం ఈ రాశుల వారికి రెండు సార్లు సంక్రాంతి.. లక్ష్మీ నారాయణ యోగంతో ఊహించని లాభాలు!
బుధుడు జ్ఞానం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు వంటి వాటికి కారకుడు. ఈ రెండు గ్రహాలు ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాయి. ఈ రెండు గ్రహాల సంయోగంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది ఐదు రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకు రాబోతోంది. ఈ రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.
గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకు వస్తుంది. జనవరి 31న ఒక అద్భుతమైన శుభయోగం ఏర్పడబోతోంది. బుధుడు జ్ఞానం, తెలివితేటలు మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు వంటి వాటికి కారకుడు. ఈ రెండు గ్రహాలు ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాయి. ఈ రెండు గ్రహాల సంయోగంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది ఐదు రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకురాబోతోంది.

ఈ సంవత్సరం ఈ రాశుల వారికి రెండు సార్లు సంక్రాంతి.. లక్ష్మీనారాయణ యోగంతో ఊహించని లాభాలు
లక్ష్మీ నారాయణ యోగం చాలా శుభప్రదమైన యోగం. ఈ యోగం అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపించినా, కొన్ని రాశుల వారు మాత్రమే ఎక్కువ లాభాలను పొందుతారు. బుధుడు, శుక్రుడు సంయోగం చెంది ఈ యోగాన్ని ఏర్పరిచారు. ఇది ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను కలిగిస్తుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.
మేష రాశి
మేష రాశి వారికి ఈ యోగం అనేక విధాలుగా లాభాలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. శుక్రుడు, బుధుడు మీకు అనేక మార్పులను తెస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. గోల్డెన్ డేస్ మొదలవుతాయి. తెలివితేటలు పెరుగుతాయి. మీ పనితో అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. జనవరి చివరికి ఏర్పడే ఈ యోగం ఈ రాశి వారికి విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఇస్తుంది. భూములు, భవనాలను కొనుగోలు చేస్తారు. హాట్ మీడియా, ఫ్యాషన్ రంగాల వారికి సమయం బాగా కలిసి వస్తుంది. ఎక్కువ లాభాలను పొందుతారు.
కన్య రాశి
కన్య రాశి వారికి ఇది శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ యోగం కారణంగా ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. సానుకూల మార్పులను చూస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. పాత అప్పులు కూడా తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు.
తులా రాశి
తులా రాశి వారికి ఈ లక్ష్మీనారాయణ యోగం అనేక విధాలుగా లాభాలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత దృఢంగా మారుతుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి రెండు గ్రహాల సంయోగం అద్భుతంగా మారుతుంది. లక్ష్మీనారాయణ యోగం కెరీర్‌లో మంచి మార్పులను తెస్తుంది. ప్రమోషన్, కొత్త బాధ్యతలు వస్తాయి. పెద్ద ప్రాజెక్టులను చేపడతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


