...
...
Next Story

250సీసీ బైక్స్​లో ఈ రెండు తోపులు- ధర రూ. 2లక్షల కన్నా తక్కువే! ఏది బెస్ట్​?

బజాజ్ పల్సర్ ఎన్​250 వర్సెస్​ సుజుకీ జిక్సర్ 250.. 250సీసీ సెగ్మెంట్​లోని ఈ రెండు బైక్స్​లో దేని ధర తక్కువ? ఎందులో ఫీచర్స్​- పవర్​ ఎక్కువ? ఏది వాల్యూ ఫర్​ మనీ? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Nov 1, 2025, 12:30:04 IST
Advertisement

బైక్​ లవర్స్​ చూపు ఇప్పుడు భారత మార్కెట్​లోని 250సీసీ మోటార్​సైకిల్​ సెగ్మెంట్​పైనే ఉంది! ఈ సెగ్మెంట్ పవర్, ఆచరణాత్మకత, రోజువారీ వినియోగంలో చక్కటి సమతుల్యతను అందిస్తుండటం ఇందుకు కారణం. 150–200సీసీ క్లాస్ నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే రైడర్‌లకు కూడా ఈ సెగ్మెంట్​ సరైన ఎంపికగా నిలుస్తోంది.

On paper, the Gixxer 250 is not only more powerful than the Pulsar N250, but it is also lighter.
On paper, the Gixxer 250 is not only more powerful than the Pulsar N250, but it is also lighter.

ఈ విభాగంలో అత్యుత్తమ పోటీదారులుగా బజాజ్ పల్సర్ ఎన్250, సుజుకీ జిక్సర్ 250 బైక్స్​ నిలుస్తున్నాయి. ఈ రెండు స్ట్రీట్‌ఫైటర్‌లు పనితీరు, సౌకర్యం కలయికను అందిస్తాయి, కానీ వాటి విధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు 250 సీసీ బైక్స్​లో ఏది బెస్ట్​? అనేది ఇక్కడ తెలుసుకండి..

బజాజ్ పల్సర్ ఎన్​250 వర్సెస్​ సుజుకీ జిక్సర్ 250..

ఇంజిన్- పర్ఫార్మెన్స్​…

రెండు మోటార్‌సైకిల్స్​ 249 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో నడుస్తాయి. కానీ వాటి పనితీరు, స్వభావం కొద్దిగా మారుతూ ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్​250.. 24.1 హెచ్‌పీ పవర్, 21.5 ఎన్ఎమ్ టార్క్, 5-స్పీడ్ గేర్‌బాక్స్​తో వస్తుంది. బలమైన మిడ్-రేంజ్, నగర వినియోగానికి ఇది అనుకూలంగా ఉంటుంది. సాధారణం హైవే క్రూయిజింగ్​కి కూడా పనికొస్తుంది.

మరోవైపు సుజుకీ జిక్సర్ 250.. 26.1 హెచ్‌పీ పవర్, 22.2 ఎన్ఎమ్ టార్క్, 6-స్పీడ్ గేర్‌బాక్స్​తో వస్తుంది. మరింత క్లీన్​, లీనియర్ పవర్ డెలివరీ దీని సొంతం. సుదీర్ఘ రైడ్‌లకు అనుకూలంగా ఉంటుంది. 6వ గేర్ కారణంగా సున్నితంగా, మెరుగైన మైలేజీతో హైవే క్రూయిజింగ్​కి పనికొస్తుంది.

ఛాసిస్- రైడ్ క్వాలిటీ..

బజాజ్​ పల్సర్ ఎన్​250: ఇందులో అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్‌లు ఉన్నాయి. అలాగే రోడ్, రెయిన్, ఆఫ్-రోడ్ వంటి మోడ్‌లతో స్విచబుల్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. ఈ ఛాసిస్ సెటప్ అధిక వేగంతో కూడా స్థిరంగా ఉంటుంది. సస్పెన్షన్ సౌకర్యం, నియంత్రణ మధ్య సమతుల్యతను నిర్వహిస్తుంది.

సుజుకీ జిక్సర్ 250: ఈ 250 సీసీ బైక్​లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు, సాధారణ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ సెటప్ మాత్రమే ఉంది. పల్సర్ (164 కిలోలు) కంటే ఇది 156 కిలోల వద్ద తేలికగా ఉంటుంది! ఇది అజిలిటీలో స్వల్ప ప్రయోజనాన్ని ఇస్తుంది.

అయితే, రోజువారీ పరిస్థితుల్లో బజాజ్​ పల్సర్.. సస్పెన్షన్, బ్రేకింగ్ టెక్నాలజీ మరింత మెరుగ్గా అనిపిస్తాయి.

ఫీచర్లు- సాంకేతికత..

బజాజ్ తన ఎన్​250 మోడల్‌కు ఆధునిక ఫీచర్లను జోడించడంపై దృష్టి పెట్టింది.

పల్సర్ ఎన్​250: ఈ 250 సీసీ బైక్​కి బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌తో కూడిన పూర్తిగా డిజిటల్ కన్సోల్ లభిస్తుంది. కొత్త తరం డిజైన్ లాంగ్వేజ్, ఎల్ఈడీ లైటింగ్, షార్ప్ బాడీ లైన్స్ దీనికి మంచి లుక్‌ను ఇస్తాయి.

జిక్సర్ 250: సుజుకీ జిక్సర్ 250 కొద్దిగా సరళంగా ఉన్నా, ఆచరణాత్మకంగా ఉంటుంది. దీనిలో కూడా బ్లూటూత్, నావిగేషన్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది.

ఫీచర్ల పరంగా చూస్తే పల్సర్ స్పష్టంగా ముందుంది.

ధర- వాల్యూ ఫర్​ మనీ..

ధర తరచుగా నిర్ణయాత్మక అంశం అవుతుంది. ఈ విషయంలో బజాజ్ తెలివిగా వ్యవహరించింది.

పల్సర్ ఎన్​250: ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.33 లక్షలు.

జిక్సర్ 250: దీని ధర సుమారు రూ. 1.82 లక్షలు.

రెండు మోడళ్ల మధ్య దాదాపు రూ. 30,000 తేడా ఉంది. ఎన్​250 అందిస్తున్న హార్డ్‌వేర్, ఫీచర్లను పరిగణనలోకి తీసుకుంటే, పల్సర్ స్పష్టంగా మెరుగైన విలువను అందిస్తుంది.

తుది తీర్పు: ఏ బైక్​ కొనుగోలు చేయాలి?

మీరు ఫీచర్లు ఎక్కువగా ఉన్న, ఆకర్షణీయమైన డిజైన్, తక్కువ ధరలో అద్భుతమైన వాల్యూ కలిగిన 250సీసీ మోటార్‌సైకిల్‌ను కోరుకుంటే, బజాజ్ పల్సర్ ఎన్​250 స్పష్టమైన విజేత. ఇది పెట్టిన డబ్బుకు ఎక్కువ ఫీచర్స్​, బహుముఖ ప్రజ్ఞ, రోడ్డుపై మంచి ఉనికిని అందిస్తుంది.

అయితే, మీ ప్రాధాన్యతలు క్లీన్​ రిఫైన్​మెంట్​, సున్నితమైన పవర్ డెలివరీ, స్పోర్టీ స్వభావం వైపు ఉంటే.. సుజుకీ జిక్సర్ 250 ఇప్పటికీ బలమైన ఆప్షన్​. ఇది సుజుకీ నాణ్యతతో తయారైంది. బయట ఆకర్షణ కంటే, అద్భుతమైన పనితీరును కోరుకునే రైడర్‌లకు జిక్సర్ 250 నచ్చుతుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe