Bank holiday : అలర్ట్! తెలంగాణలోని బ్యాంకులకు ఈరోజు నుంచి వరుస సెలవులు..

Bank holiday today : అలర్ట్! ఈరోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు లభిస్తున్నాయి. హైదరాబాద్​ సహా అనేక ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడి ఉంటాయి. ఇందుకు గల కారణాలు, ప్రత్యామ్నాయ మార్గాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Jun 26, 2026, 05:58:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వివిధ పనుల మీద నిత్యం బ్యాంకులకు తిరిగే వారికి బిగ్​ అప్డేట్​! దేశవ్యాప్తంగా.. ఈరోజు నుంచి ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు లభిస్తున్నాయి. మొహర్రం కావడంతో శుక్రవారం నాడు బ్యాంకులు మూతపడి ఉంటాయి. ఇక నాల్గొవ శనివారం, ఆదివారం కావడంతో రేపు, ఎల్లుండి సైతం బ్యాంకులకు హాలీడేలే!

వరుసగా 3 రోజుల పాటు బ్యాంకు సెలవులు..
వరుసగా 3 రోజుల పాటు బ్యాంకు సెలవులు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన జూన్ 2026 సెలవుల జాబితా ప్రకారం.. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన పండుగలను కలుపుకుని ఈ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులకు సెలవు దినాలుగా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ వారం కూడా సుదీర్ఘ సెలవులు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు సెలవు?

జూన్ 26 (శుక్రవారం): తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు దేశంలోని మరికొన్ని ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, బెలాపూర్, భోపాల్, అగర్తలా, ఐజ్వాల్, జమ్మూ, కాన్పూర్, లక్నో, నాగ్‌పూర్, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్ పరిధులలో మొహర్రం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.

(కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సర్కిల్ పరిధిలో మొహర్రం సందర్భంగా బ్యాంకులకు గురువారం సెలవు ఇచ్చారు.)

జూన్ 27 (నాల్గొవ శనివారం): నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, ఆర్బీఐ నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 'నాల్గొవ శనివారం' కారణంగా పూర్తిగా మూతపడతాయి.

జూన్ 28 (ఆదివారం): దేశవ్యాప్తంగా సాధారణ వీకెండ్ ఆదివారం సెలవు ఉంటుంది.

ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథాతథం..

బ్యాంకు శాఖలు భౌతికంగా మూతపడినప్పటికీ, కస్టమర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు డిజిటల్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు 24 గంటలూ సజావుగా పనిచేస్తాయి. ఖాతాదారులు ఒకరికొకరు డబ్బులు పంపించుకోవడానికి లేదా పేమెంట్లు చేయడానికి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లేదా ఆయా బ్యాంకుల అఫీషియల్ యాప్స్ వాడుకోవచ్చు. అలాగే ఏటీఎం సేవల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. కేవలం డిమాండ్ డ్రాఫ్ట్, చెక్‌బుక్ క్లియరెన్స్ వంటి ఇన్-బ్రాంచ్ సేవల కోసం మాత్రమే కస్టమర్లు సెలవులు ముగిసేవరకు వేచి చూడాల్సి ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More