BSNL recruitment 2025 : నెలకు రూ. 50,500 వరకు జీతంతో బీఎస్ఎన్ఎల్లో ట్రైనీ ఉద్యోగాలు..
బీఎస్ఎన్ఎల్లో 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు సంబంధించి అర్హతలు, జీతం, ఎంపిక విధానం సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పథకం కింద 120 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్). దీనికి సంబంధించి ఒక తాత్కాలిక నోటిఫికేషన్ని ఈ టెలికాం సంస్థ విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తు లింక్ కోసం అధికారిక వెబ్‌సైట్ bsnl.co.in ను తరచుగా పరిశీలించాలని సూచించింది.

బీఎస్ఎన్ఎల్ రిక్రూట్‌మెంట్ 2025 ద్వారా మొత్తం 120 పోస్టులను భర్తీ చేయనున్నారు. అవి..
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (డీఆర్) - టెలికాం స్ట్రీమ్: 95 (తాత్కాలిక) పోస్టులు.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (డీఆర్) - ఫైనాన్స్ స్ట్రీమ్: 25 (తాత్కాలిక) పోస్టులు.
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్లలో ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ/మాజీ సైనికులు వంటి వర్గాలకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
బీఎస్ఎన్ఎల్ రిక్రూట్‌మెంట్ 2025- జీతం, వయోపరిమితి..
పే స్కేల్ (జీతాల శ్రేణి): రూ. 24,900 నుంచి రూ. 50,500 వరకు ఉంటుంది.
వయోపరిమితి: దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు.
బీఎస్ఎన్ఎల్ రిక్రూట్‌మెంట్ 2025- ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల నియామకాన్ని రాతపూర్వక పోటీ పరీక్ష (కంప్యూటర్ ఆధారిత - మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్) ద్వారా నిర్వహిస్తారు.
బీఎస్ఎన్ఎల్ రిక్రూట్‌మెంట్ 2025- అర్హత ప్రమాణాలు..
టెలికాం స్ట్రీమ్ కోసం అర్హతలు..
అభ్యర్థి తప్పనిసరిగా కింది విభాగాల్లో ఏదో ఒకదానిలో 60 శాతం మార్కులతో రెగ్యులర్ ఫుల్-టైమ్ ప్రాతిపదికన బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ లేదా దానికి సమానమైన ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి:
- ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్
- ఎలక్ట్రానిక్స్
- కంప్యూటర్ సైన్స్
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- ఎలక్ట్రికల్
- ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఈ కోర్ విభాగాలతో పాటు ఇతర అనుబంధ రంగాల కలయికలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఫైనాన్స్ స్ట్రీమ్ కోసం అర్హతలు..
అభ్యర్థికి చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్య గమనిక..
"దరఖాస్తు షెడ్యూల్, పరీక్షా విధానం, పరీక్షా రుసుము, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్, పరీక్ష తేదీ మొదలైన వివరాలు అధికారిక బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయి. అర్హత గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్, పరీక్షా షెడ్యూల్, ఫీజు, ఇతర సంబంధిత సమాచారం కోసం బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించడమైనది," అని టెలికా సంస్థ ఏజీఎం, రిక్రూట్‌మెంట్ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


