...
...
Next Story

CBSE 10th results 2026 : సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

CBSE Result class 10 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) 10వ తరగతి ఫలితాలను ఎలా చూసుకోవాలో పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Updated on: Apr 15, 2026, 16:27:48 IST
Advertisement

CBSE Results 2026 : సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 10వ తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది.

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు- ఫలితాలు ఎక్కడ చూడాలి?

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాల అప్డేట్స్..
సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాల అప్డేట్స్..

అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in తో పాటు మరిన్ని ప్లాట్‌ఫారమ్స్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు:

  1. డిజీలాకర్ : మార్క్‌షీట్లు, మైగ్రేషన్ సర్టిఫికేట్లు ‘పరిణామ్ మంజుషా’ రెపోజిటరీ ద్వారా డిజీలాకర్‌లో అందుబాటులో ఉంటాయి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు లాగిన్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి.
  2. యాప్స్: ‘DigiResults’ ఆండ్రాయిడ్ యాప్ లేదా ‘UMANG’ యాప్ ద్వారా కూడా రిజల్ట్స్ చూడవచ్చు.
  3. ఇతర మార్గాలు: వెబ్‌సైట్ ఓపెన్ కాకపోతే ఎస్​ఎంఎస్ లేదా ఐవీఆర్​ఎస్ ద్వారా కూడా మార్కులు తెలుసుకునే సదుపాయం ఉంటుంది.

సీబీఎస్​ఈ 10వ తరగతి ఫలితాలు- ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే విధానం..

స్టెప్​ 1- ముందుగా https://results.cbse.nic.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో 'CBSE Class 10 Result 2026' లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- మీ రోల్ నంబర్, స్కూల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి.

స్టెప్​ 4- స్క్రీన్‌పై మీ మార్క్‌షీట్ కనిపిస్తుంది.

స్టెప్​ 5- భవిష్యత్తు అవసరాల కోసం దానిని డౌన్‌లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1.. వెబ్‌సైట్ కాకుండా వేరే ఎక్కడ రిజల్ట్స్ చూడవచ్చు?

UMANG యాప్, DigiLocker, SMS ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.

2. మార్క్‌షీట్ అసలు కాపీ ఎక్కడ లభిస్తుంది?

డిజిటల్ మార్క్‌షీట్లను డిజీలాకర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్ కాపీలను మీ స్కూల్ నుంచి సేకరించాల్సి ఉంటుంది.

3. స్కోరు నచ్చకపోతే మళ్లీ పరీక్ష రాసే అవకాశం ఉందా?

అవును, కొత్త విధానం ప్రకారం గరిష్టంగా మూడు సబ్జెక్టులలో ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసి మీ మార్కులను పెంచుకోవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks