CBSE class 12 results 2026 : మే మూడో వారంలో సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు? ఎలా చెక్​ చేసుకోవాలి?

CBSE class 12 results 2026 expected date : మీడియా కథనాల ప్రకారం సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు ఈసారి మే 3వ వారంలో వెలువడే అవకాశం ఉంది. ఎలా చెక్​ చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 1, 2026, 13:00:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

CBSE results 2026 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 10.2 లక్షల మంది విద్యార్థులకు కీలక సమాచారం అందింది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు జరిగాయి. పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను బోర్డు వేగవంతం చేసింది. ప్రస్తుతం ఫలితాల ప్రాసెసింగ్ తుది దశకు చేరుకుంది. గత ఏడాది మే రెండో వారంలోనే ఫలితాలు వచ్చినప్పటికీ, ఈసారి స్వల్ప జాప్యం జరిగి మే మూడో వారంలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి!

సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలు ఎప్పుడు?
సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలు ఎప్పుడు?

ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన పరీక్షల నియంత్రణాధికారి..

కొత్తగా ప్రవేశపెట్టిన సిస్టమ్‌లో సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను సీబీఎస్‌ఈ పరీక్షల నియంత్రణాధికారి సన్యం భరద్వాజ్ ఖండించారు. పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. "ఫలితాల ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయనే వార్తల్లో నిజం లేదు, అంతా ప్రణాళిక ప్రకారమే సాగుతోంది" అని స్పష్టం చేశారు. దీనితో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించారు.

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలను ఎక్కడ చూసుకోవాలి?

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు ఈ కింది అధికారిక వెబ్‌సైట్లలో మార్కులను చూసుకోవచ్చు:

results.cbse.nic.in

cbse.gov.in

cbseresults.nic.in

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు 2026- రిజల్ట్స్ చెక్ చేసుకునే విధానం..

స్టెప్​ 1- పైన పేర్కొన్న ఏదైనా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో కనిపించే "CBSE Class 12 Result 2026" లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- మీ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ వివరాలను నమోదు చేయండి.

స్టెప్​ 4- సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయగానే మీ మార్క్ షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టెప్​ 5- భవిష్యత్తు అవసరాల కోసం రిజల్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవడం మంచిది.

వెబ్‌సైట్లలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు విద్యార్థులు డిజీలాకర్, లేదా ఉమంగ్ యాప్ ద్వారా కూడా తమ డిజిటల్ మార్క్ షీట్లను పొందవచ్చు. అధికారిక ప్రకటన వెలువడే వరకు విద్యార్థులు తమ లాగిన్ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడు వస్తాయి?

మే 2026 మూడో వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

2. రిజల్ట్ చెక్ చేయడానికి ఏయే వివరాలు అవసరం?

విద్యార్థి రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ తప్పనిసరిగా ఉండాలి.

3. మార్క్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా?

అవును, అధికారిక వెబ్‌సైట్లతో పాటు డిజీలాకర్, ఉమంగ్ యాప్స్ ద్వారా కూడా మార్క్ షీట్లను వెరిఫైడ్ ఫార్మాట్‌లో పొందవచ్చు.

4. ఈ ఏడాది ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాశారు?

సుమారు 10.2 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More