ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి డిజిటల్ అసిస్టెంట్‌గా మారిన 'ChatGPT' తాజాగా అమెరికాలో మొరాయించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి వేలాది మంది యూజర్లకు ఈ చాట్‌బాట్ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ముఖ్యంగా కొత్తగా ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించిన వారికి ఎర్రర్ మెసేజ్‌లు రావడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అవుటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ 'డౌన్‌డిటెక్టర్' (Downdetector) నివేదిక ప్రకారం మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటల మధ్య (ఈస్టర్న్ టైమ్) ఫిర్యాదులు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. దాదాపు 12,500 మందికి పైగా యూజర్లు తమకు సర్వీస్ అందడం లేదని రిపోర్ట్ చేశారు. అయితే కొద్ది గంటల తర్వాత ఈ ఫిర్యాదుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది.
OpenAI వివరణ ఇదే..
ఈ సాంకేతిక లోపంపై ChatGPT మాతృ సంస్థ OpenAI స్పందించింది. తమ అఫీషియల్ స్టేటస్ పేజీలో 'ఫైన్ ట్యూనింగ్ జాబ్స్' (Finetuning jobs), ప్లాట్‌ఫామ్ యూజర్లకు 'ఎలివేటెడ్ ఎర్రర్ రేట్స్' (Elevated error rates) సమస్య తలెత్తినట్లు కంపెనీ ధృవీకరించింది. తక్షణమే దిద్దుబాటు చర్యలు ప్రారంభించి, ప్రస్తుతం సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు పేర్కొంది. ఇప్పుడు అన్ని సేవలు యధాతథంగా పనిచేస్తున్నాయని సంస్థ స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో నెటిజన్ల గోల..
ChatGPT పని చేయకపోవడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన X (ట్విట్టర్), రెడ్డిట్‌లలో ఫన్నీ మీమ్స్, కామెంట్లు సందడి చేశాయి. ఒక యూజర్ స్పందిస్తూ.. "నా రోజంతా ఎలా గడిచిందో ఎవరో అడిగారు, కానీ ChatGPT పని చేయకపోవడంతో వారికి సమాధానం కూడా చెప్పలేకపోతున్నాను" అని సరదాగా రాసుకొచ్చారు.
మరో యూజర్ తన ఆవేదనను ఇలా పంచుకున్నారు.. "నా బెస్ట్ ఫ్రెండ్, నా థెరపిస్ట్, నా జ్యోతిష్యుడు, నా లాయర్.. ఇలా ప్రతీ చిన్న విషయానికి నేను ఆధారపడే నా కన్సల్టెంట్ ChatGPT డౌన్ అయిపోయింది. త్వరగా తిరిగిరా చాట్" అంటూ పోస్ట్ చేశారు.
{{/usCountry}}మరో యూజర్ తన ఆవేదనను ఇలా పంచుకున్నారు.. "నా బెస్ట్ ఫ్రెండ్, నా థెరపిస్ట్, నా జ్యోతిష్యుడు, నా లాయర్.. ఇలా ప్రతీ చిన్న విషయానికి నేను ఆధారపడే నా కన్సల్టెంట్ ChatGPT డౌన్ అయిపోయింది. త్వరగా తిరిగిరా చాట్" అంటూ పోస్ట్ చేశారు.
{{/usCountry}}ఇంకొక యూజర్ అయితే "నాకు ఎర్రర్ మెసేజ్ రాగానే, అసలు ఆ మెసేజ్ అర్థం ఏంటో మళ్ళీ ChatGPT నే అడగడానికి ప్రయత్నించాను. నేను దానికి ఎంతలా బానిస అయిపోయానో అప్పుడు అర్థమైంది" అని చేసిన వ్యాఖ్య నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.
ప్రస్తుతం సాంకేతిక సమస్యలు తొలగిపోవడంతో యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం అమెరికాలోనే కాకుండా బ్రిటన్ వంటి దేశాల్లో కూడా స్వల్పంగా ఈ ప్రభావం కనిపించినట్లు సమాచారం.