తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు- 2026 హాలీడే లిస్ట్​ ఇదిగో..

2026 బ్యాంకు సెలవులకు సంబంధించిన లిస్ట్​ని ఆర్బీఐ విడుదల చేసింది. 2026 జనవరి నుంచి డిసెంబర్​ వరకు బ్యాంకులు ఏ రోజుల్లో మూతపడి ఉంటాయో ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Dec 31, 2025, 09:01:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 అడుగు దూరంలో ఉంది. 2025కి వీడ్కోలు పలుకుతూ ప్రపంచం ఇంకొన్ని గంటల్లో నూతన ఏడాదిలోకి ప్రవేశిస్తుంది. ఈ సందర్భంగా 2026 బ్యాంకు సెలవుల లిస్ట్​ని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. వచ్చే ఏడాది బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయి? ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయి? వంటి విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా బ్యాంకు పనుల కోసం నిత్యం తిరిగే వారు ఈ లిస్ట్​ని కచ్చితంగా చూడాలి.

2026 బ్యాంకు సెలవుల లిస్ట్​.. (REUTERS)
2026 బ్యాంకు సెలవుల లిస్ట్​.. (REUTERS)

2026లో బ్యాంకు సెలవుల లిస్ట్​..

జనవరి 1: నూతన ఏడాది

జనవరి 10: రెండో శనివారం

జనవరి 14, 15, 16: సంక్రాంతి

జనవరి 24: 4వ శనివారం

జనవరి 26: రిపబ్లిక్​ డే

(అంటే అదివారంతో కలిపి జనవరి 24 నుంచి 26 వరకు బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి)

ఫిబ్రవరి 14: 2వ శనివారం

ఫిబ్రవరి 28: 4వ శనివారం

మార్చ్​ 3: హోలీ

మార్చ్​ 14: 2వ శనివారం

మార్చ్​ 20: ఉగాది

మార్చ్​ 28: 4వ శనివారం

ఏప్రిల్​ 3: గుడ్​ ఫ్రైడే

ఏప్రిల్​ 11: 2వ శనివారం

  • రిపబ్లిక్​ డే నుంచి క్రిస్మస్​ వరకు- 2026లో స్టాక్​ మార్కెట్​ సెలవుల లిస్ట్​ని తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఏప్రిల్​ 14: వైశాఖి, అంబేడ్కర్​ జయంతి

ఏప్రిల్​ 25: 4వ శనివారం

మే 1: మే డే

మే 9: 2వ శనివారం

మే 23: 4వ శనివారం

మే 27: బక్రీద్​

జూన్​ 13: 2వ శనివారం

జూన్​ 27: 4వ శనివారం

జులై 11: 2వ శనివారం

జులై 25: 4వ శనివారం

ఆగస్ట్​ 8: 2వ శనివారం

ఆగస్ట్​ 15: స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్ట్​ 22: 4వ శనివారం

సెప్టెంబర్​ 4: జన్మాష్టమి

సెప్టెంబర్​ 12: 2వ శనివారం

సెప్టెంబర్​ 26: 4వ శనివారం

అక్టోబర్​ 2: గాంధీ జయంతి

అక్టోబర్​ 10: 2వ శనివారం

అక్టోబర్​ 20: దసహా

అక్టోబర్​ 24: 4వ శనివారం

నవంబర్​ 8: దీపావళి

నవంబర్​ 14: 2వ శనివారం

నవంబర్​ 24: గురునానక్​ జయంతి

నవంబర్​ 28- 4వ శనివారం

డిసెంబర్​ 12: 2వ శనివారం

డిసెంబర్​ 25: క్రిస్మస్​

డిసెంబర్​ 26: 4వ శనివారం

(అంటే ఆదివారంతో కలుపుకుని డిసెంబర్​ 25 నుంచి 28 వరకు బ్యాంకు సెలవులు ఉంటాయి)

వీటితో పాటు ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. మహా శివరాత్రి వంటి కొన్ని సెలవులు ఈసారి ఆదివారం నాడు వచ్చాయి. తెలంగాణలో బోనాల నేపథ్యంలో ఆగస్ట్​ 10న బ్యాంకులకు సెలవు ఉంటుంది.

బ్యాంకులు మూతపడి ఉన్నా ఆయా రోజుల్లో యూపీఐ పేమెంట్స్​, ఏటీఎం వంటి ఆప్షన్స్​ ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. కానీ ఇతర బ్యాంకు కార్యకలాపాలను మాత్రం ముందుగానే ప్లాన్​ చేసుకోవాల్సి ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More