రిపబ్లిక్​ డే నుంచి క్రిస్మస్​ వరకు- 2026లో స్టాక్​ మార్కెట్​కి ఎన్ని రోజులు సెలవులు అంటే..

2026లో దేశీయ స్టాక్​ మార్కెట్​కి ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి? ఏ తేదీల్లో సెలవులు ఉన్నాయి? ట్రేడర్లు, మదుపర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 2026 స్టాక్​ మార్కెట్ హాలీడే​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 30, 2025, 10:45:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 అడుగు దూరంలో ఉంది. అదే సమయంలో 2025 చివరి స్టాక్​ మార్కెట్​ ట్రేడింగ్​ సెషన్ రేపు​ జరగనుంది. ఈ నేపథ్యంలో 2026 స్టాక్​ మార్కెట్​ సెలవుల గురించి తెలుసుకోవాలని ఇన్వెస్టర్లు, ట్రేడర్లు చూస్తుంటారు. అందుకే ఎన్​ఎస్​ఈ, బీఎస్​ఈ, ఎంసీఎక్స్​కి సంబంధించిన 2026 ట్రేడింగ్​ హాలీడే వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2026 స్టాక్​ మార్కెట్​ హాలీడే లిస్ట్​.. (Bloomberg)
2026 స్టాక్​ మార్కెట్​ హాలీడే లిస్ట్​.. (Bloomberg)

2026లో స్టాక్​ మార్కెట్​ సెలవుల లిస్ట్​..

అధికారిక క్యాలెండర్​ ప్రకారం 2026లో దేశీయ స్టాక్​ మార్కెట్​ ఈ తేదీల్లో మూతపడి ఉంటుంది.

జనవరి 26 (సోమవారం)- రిపబ్లిక్​ డే

మార్చ్​ 3(మంగళవారం)- హోలీ

మార్చ్​ 26 (గురువారం)- శ్రీ రామ నవమి

మార్చ్​ 31 (మంగళవారం)- శ్రీ మహావీర్​ జయంతి

ఏప్రిల్​ 3 (శుక్రవారం)- గుడ్​ ఫ్రైడే

ఏప్రిల్​ 14 (మంగళవారం)- డా బాబా సాహెబ్​ అంబేడ్కర్​ జయంతి

మే 1 (శుక్రవారం)- మహారాష్ట్ర డే

మే 28 (గురువారం)- బక్రీద్​

జూన్​ 26 (శుక్రవారం)- మొహర్రం

సెప్టెంబర్​ 14 (సోమవారం)- వినాయక చవితి

  • 2026లో ‘లాంగ్​ వీకెండ్​’ జాతర- దాదాపు ప్రతి నెలలో వరుస సెలవులు! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

అక్టోబర్​ 2 (శుక్రవారం)- మహాత్మా గాంధీ జయంతి

అక్టోబర్​ 20 (మంగళవారం)- దసరా

నవంబర్​ 10 (మంగళవారం)- దీపావళి

నవంబర్​ 24 (మంగళవారం- గురునానక్​ జయంతి

డిసెంబర్​ 25 (శుక్రవారం)- క్రిస్మస్

అంటే 2026లో స్టాక్​ మార్కెట్​కు 15 రోజుల ప్రత్యేక, పండుగ సెలవులు ఉన్నాయి. ఆయా తేదీల్లో ఈక్విటీ, డెరివేటివ్స్​, కరెన్సీ, కమొడిటీ సెగ్మెంట్​లో ట్రేడింగ్​ కార్యకలాపాలు జరగవు.

వీటితో పాటు ప్రతి శని, ఆదివారాలు (సెబీ నోటిఫికేషన్లు మినహా) బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలకు హాలీడే ఉంటుంది. మహాశివరాత్రి, స్వాతంత్ర్య దినోత్సవం వంటి కొన్ని ప్రత్యేక, పండుగ సెలవులు సైతం ఈసారి శని, ఆదివారాల్లో వచ్చాయి.

వీటికి అదనంగా, సెటిల్​మెంట్​ హాలీడేల వివరాలు కూడా స్టాక్​ మార్కెట్​ క్యాలెండర్​లో పొందుపరిచారు. సెటిల్​మెంట్​ హాలీడే రోజున మార్కెట్​లు ఓపెన్​లో ఉండొచ్చు, కానీ క్లియరింగ్​, సెటిల్​మెంట్​ కార్యకలాపాలు మూతపడి ఉంటాయి. ఇది ఫండ్​ ట్రాన్స్​ఫర్స్​, సెక్యురిటీ క్రెడిట్​ వంటి వాటిని ప్రభావితం చేస్తుంది.

ఫిబ్రవరి 19, ఏప్రిల్​ 1, ఆగస్ట్​ 27న సెటిల్​మెంట్​ హాలీడేలు ఉంటాయని మదుపర్లు, ట్రేడర్లు గుర్తుపెట్టుకోవాలి.

స్టాక్​ మార్కెట్​ హాలీడే లిస్ట్​ అందుబాటులో పెట్టుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ట్రేడ్​ ఎగ్జిట్​, ఎంట్రీ వంటి కార్యకలాపాలను ముందుగానే ప్లాన్​ చేసుకునే అవకాశం ఉంటుంది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఇలా..

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు నిఫ్టీ50 28 పాయింట్ల లాభంలో 25,971 వద్ద ట్రేడ్​ అవుతోంది. సెన్సెక్స్​ 98 పాయింట్ల లాభంతో 84,793 వద్ద కొనసాగుతోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More