మోటోరోలా నుంచి రెండు కొత్త ‘మోటో’ స్మార్ట్‌ఫోన్స్- 7000ఎంఏహెచ్ బ్యాటరీతో..
మోటోరోలా నుంచి మోటో జీ57, మోటో జీ57 పవర్ స్మార్ట్‌ఫోన్స్ తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టాయి. వీటి ధరలు రూ. 30వేల కన్నా తక్కువగా ఉన్నాయి. వీటి ఫీచర్స్ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మోటోరోలా సంస్థ తాజాగా లాంచ్ చేసిన మోటో జీ57, మోటో జీ57 పవర్ స్మార్ట్‌ఫోన్స్‌పై మంచి బజ్ నెలకొంది. మంచి పనితీరు, ఎక్కువ సేపు పనిచేసే బ్యాటరీ, మన్నికైన నిర్మాణం కోరుకునే వినియోగదారుల కోసం ఈ ఫోన్‌లను.. బడ్జెట్ ధరలోనే రూపొందించడం విశేషం. ఈ నేపథ్యంలో గ్యాడ్జెట్స్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మోటో జీ57, మోటో జీ57 పవర్: ఫీచర్స్..
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. వీటిలో 6.72 ఇంచ్ ఫుల్-హెచ్డీ+ డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 1050 నిట్స్ పీక్ బ్రైట్నెస్కి మద్దతు ఇస్తుంది. డిస్‌ప్లేలు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణతో వస్తాయి.
మోటో జీ57 పవర్ ప్రత్యేకతలు:
ఆపరేటింగ్ సిస్టమ్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ర్యామ్ అండ్ స్టోరేజ్: ఇది 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ని అందిస్తుంది. ర్యామ్ బూస్ట్ 4.0 ద్వారా దీనిని 24జీబీ వరకు వర్చువల్‌గా విస్తరించుకోవచ్చు.
కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, బైడుయో వంటి కనెక్టివిటీ ఎంపికలు ఇందులో ఉన్నాయి. అలాగే, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.
కెమెరా: ఫోటోగ్రఫీ కోసం, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50ఎంపీ సోనీ ఎల్వైటీ-600 సెన్సార్ ప్రధానమైనది. దీనికి 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, మెరుగైన డెప్త్, కలర్ ఖచ్చితత్వం కోసం ఒక లైట్ సెన్సార్ ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8ఎంపీ కెమెరా ఉంది.
ఆడియో: మీడియా, కాల్స్ కోసం స్పష్టమైన సౌండ్ అవుట్‌పుట్‌ను అందించే డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్‌తో కూడిన స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంది.
బ్యాటరీ: ఈ పరికరంలో 7,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 గంటల వరకు రన్‌టైమ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది!
మోటో జీ57 ప్రత్యేకతలు:
స్టాండర్డ్ మోటో డీ57 మోడల్ మాత్రం 5,200ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనికి కూడా 30డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
మన్నిక : ఈ రెండు డివైజ్‌లు MIL-STD-810H6 మిలిటరీ-గ్రేడ్ ప్రమాణాలకు అనుగుణంగా తయారయ్యాయి. అలాగే, ఐపీ64 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. అంటే, ఇవి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అందిస్తాయి.
మోటో జీ57, మో జీ57 పవర్- ధరలు..
మోటో జీ57 పవర్ ధర 279 యూరోలుగా (సుమారు రూ. 28,000) నిర్ణయించారు. ఇది పాంటోన్ కార్సైర్, పాంటోన్ ఫ్లూయిడిటీ, పాంటోన్ పింక్ లెమనేడ్ అనే మూడు రంగుల ఎంపికలలో లభిస్తుంది.
ప్రామాణిక మోటో జీ57 ధర 249 యూరోలు (సుమారు రూ. 25,000). ఈ ఫోన్ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ మార్కెట్లో అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


