Renault Triber : బడ్జెట్​ 7 సీటర్ ఫ్యామిలీ​ ఎంపీవీ రెనాల్ట్ ట్రైబర్​పై అదిరే ఆఫర్లు- వివరాలు..

Renault Triber July Offers : భారత మార్కెట్లో అత్యంత చౌకైన 7 సీటర్ ఎంపీవీగా గుర్తింపు తెచ్చుకున్న రెనాల్ట్ ట్రైబర్‌పై ఈ నెలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది సంస్థ. వేరియంట్, ప్రాంతాన్ని బట్టి రూ. 60,000 వరకు లభించే ఈ ఆఫర్ల పూర్తి వివరాలు మీకోసం.

Published on: Jul 14, 2026, 05:42:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మధ్యతరగతి కుటుంబాలకు, పెద్ద ఫ్యామిలీతో కలిసి ప్రయాణించాలనుకునే వారికి భారత ఆటోమొబైల్ మార్కెట్లో బడ్జెట్ ధరలో దొరికే అత్యుత్తమ ఆప్షన్ 'రెనాల్ట్ ట్రైబర్'! ప్రస్తుతం ఈ ఎంపీవీని కొనాలనుకునే కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా భారీ ఆఫర్లను ప్రకటించింది. తమ పాపులర్ మల్టీ పర్పస్ వెహికల్ అయిన ట్రైబర్‌పై ఏకంగా రూ. 60,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ..
రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ..

అయితే ఈ ఆఫర్లు ఈ నెల చివరి వరకే అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల అర్హత, మోడల్ ఇయర్, కారు వేరియంట్, వారు నివసించే రాష్ట్రాలను బట్టి ఈ డిస్కౌంట్లలో మార్పులు ఉంటాయి.

రాష్ట్రాల వారీగా రెనాల్ట్​ ట్రైబర్​పై డిస్కౌంట్ వివరాలు..

రెనాల్ట్ ఇండియా విడుదల చేసిన అధికారిక జాబితా ప్రకారం.. ఈ జులై నెలలో కేరళలోని ట్రైబర్ ఎంపీవీ కస్టమర్లకు అత్యధికంగా రూ. 60,000 వరకు మొత్తం ప్రయోజనాలు లభించనున్నాయి. అలాగే గుజరాత్‌లో కారు కొనుగోలు చేసే వారికి రూ. 45,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని మిగిలిన మెజారిటీ రాష్ట్రాలలో 2026 మోడళ్లపై గరిష్టంగా రూ. 30,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

ఈ మొత్తం ఆఫర్ ప్యాకేజీలో కస్టమర్ ఎంచుకునే స్కీమ్ ఆధారంగా రూ. 30,000 వరకు నేరుగా క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు పాత కారును మార్చుకునే వారికి ఎక్స్​ఛేంజ్ బోనస్, పాత వాహనాన్ని స్క్రాప్ చేయాలనుకునే వారికి స్క్రాపేజ్ బెనిఫిట్స్, రెనాల్ట్ పాత కస్టమర్లకు లాయల్టీ బోనస్, రెఫరల్, కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా కలిసి ఉన్నాయి. స్టాక్ లభ్యత, డీలర్ల భాగస్వామ్యాన్ని బట్టి మీ నగరంలో లభించే ఖచ్చితమైన ఆఫర్ ధరల కోసం సమీపంలోని అధీకృత రెనాల్ట్ షోరూమ్‌ను సంప్రదించాల్సిందిగా కంపెనీ సూచించింది.

రెనాల్ట్ ట్రైబర్- ధర, మైలేజ్ వివరాలు..

ప్రస్తుతం మార్కెట్లో రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభ ధర రూ. 5.81 లక్షల నుంచి టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.48 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉంది. ఈ ధర పరిధిలో ఏడుగురు సౌకర్యవంతంగా కూర్చునేలా ఫ్లెక్సిబుల్ సీటింగ్ అమరికను ఆఫర్ చేస్తున్న ఏకైక ఎంపీవీ ఇదే కావడం విశేషం!

మైలేజ్ పరంగా చూస్తే మాన్యువల్ వేరియంట్ లీటరుకు 20.0 కిలోమీటర్ల వరకు, ఏఎంటీ వేరియంట్ లీటరుకు 17.0 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని ఏఆర్​ఏఐ ధృవీకరించింది.

రెనాల్ట్ ట్రైబర్- అదిరిపోయే ఫీచర్లు.. పటిష్టమైన భద్రత..

వేరియంట్‌ను బట్టి వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ కలిగిన 8 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, వెనుక సీట్ల ప్రయాణికుల కోసం రేర్ ఏసీ వెంట్స్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కీ‌లెస్ ఎంట్రీ, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్‌సైడ్ రేర్-వ్యూ మిరర్స్, కూల్డ్ సెంటర్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి.

భద్రత విషయంలోనూ రెనాల్ట్ ఎక్కడా రాజీ పడలేదు. ఈ ఎంపీవీ బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించడం విశేషం. వీటితో పాటు ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రేర్ పార్కింగ్ సెన్సార్లు, రివర్సింగ్ కెమెరా వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More