లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌తో కూడిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా సాధారణ మెజారిటీ లభించినప్పటికీ, ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్దతు అవసరమైంది. ఆమేరకు మద్దతు లభించకపోవడంతో బిల్లు వీగిపోయింది.

Published on: Apr 17, 2026, 19:56:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఉద్దేశించిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. ఓటింగ్‌కు హాజరైన 489 మంది సభ్యుల్లో 278 మంది సభ్యులు అనుకూలంగా, 211 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. అయితే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండో వంతు మంది సభ్యుల బలం అవసరం. ఈ లెక్కన 326 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయ్యాలి. కానీ 278 మంది సభ్యులు మాత్రమే అనుకూలంగా ఓటేశారు.

ఓటింగ్ తీరు (PTI)
ఓటింగ్ తీరు (PTI)

ఈ బిల్లుపై ఉదయం నుంచి అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఎన్డీయే మిత్రపక్షాలన్నీ మద్దతు పలికాయి. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలికింది. అయితే ప్రతిపక్ష ఇండియా బ్లాక్ నుంచి అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్లకు తాము అనుకూలమేనని, అయితే దీనిని డీలిమిటేషన్‌కు ముడిపెట్టడం సరికాదని వాదించాయి.

చర్చకు హోం మంత్రి అమిత్ షా సమాధానమిస్తూ వంకలు, సాకులు చెప్పి కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లను అడ్డుకుంటోందని, దీనికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More