పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) మైదానంలోనే కాదు.. సంపాదనలోనూ తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న అథ్లెట్ గా అతడు తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తాజాగా వెలువడిన 2025 అత్యధిక సంపాదన కలిగిన స్పోర్ట్స్ పర్సన్స్ జాబితాలో రొనాల్డో వరుసగా మూడో ఏడాది కూడా నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. టాప్ 10లో ఏ ఒక్క క్రికెటర్ కు కూడా చోటు దక్కలేదు.
రెండో స్థానానికి బాక్సర్.. మెస్సీకి షాక్
ఈసారి జాబితాలో కొన్ని అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీని వెనక్కి నెట్టి, మెక్సికన్ బాక్సర్ సాల్ కానెలో అల్వారెజ్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. 2025లో అమెరికన్ బాక్సర్ టెరెన్స్ క్రాఫోర్డ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక పోరులో అల్వారెజ్ ఓడిపోయినప్పటికీ.. ఆ మ్యాచ్ ద్వారా అతనికి దక్కిన గ్యారెంటీడ్ పారితోషికం అతన్ని ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో నిలబెట్టింది. దీంతో మెస్సీ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.
రొనాల్డో సంపాదన రూ. 2100 కోట్లు
రొనాల్డో 2025లో మొత్తం 260 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2100 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాడు. ఇందులో సౌదీ క్లబ్ ‘అల్ నజర్’ నుంచి వచ్చే వేతనం 200 మిలియన్ డాలర్లు కాగా, మిగిలిన 60 మిలియన్ డాలర్లు మైదానం బయట వచ్చే ఎండార్స్‌మెంట్ల ద్వారా సమకూరాయి.
దూసుకొచ్చిన జువాన్ సోటో..
డొమినికన్ బేస్‌బాల్ ప్లేయర్ జువాన్ సోటో ఈ జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. న్యూయార్క్ మెట్స్ జట్టుతో అతడు కుదుర్చుకున్న భారీ ఒప్పందం (15 ఏళ్లకు 765 మిలియన్ డాలర్లు) దీనికి ప్రధాన కారణం. గత ఏడాది అతని సంపాదన 129.2 మిలియన్ డాలర్లు. సోటో రాకతో అమెరికన్ బాస్కెట్‌బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ ఐదో స్థానానికి దిగిరావాల్సి వచ్చింది.
సౌదీ లీగ్ హవా
టాప్-10లో ఫుట్‌బాల్ ఆటగాళ్లదే ఆధిపత్యం కనిపిస్తోంది. ఇందులోనూ సౌదీ ప్రో లీగ్ ప్రభావం స్పష్టంగా ఉంది. రొనాల్డోతో పాటు కరీమ్ బెంజెమా (6వ స్థానం), రియాద్ మహ్రెజ్ (45వ స్థానం), సాడియో మానె (52వ స్థానం) వంటి వారు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
2025లో అత్యధిక ఆర్జన కలిగిన టాప్-10 అథ్లెట్లు
{{/usCountry}}టాప్-10లో ఫుట్‌బాల్ ఆటగాళ్లదే ఆధిపత్యం కనిపిస్తోంది. ఇందులోనూ సౌదీ ప్రో లీగ్ ప్రభావం స్పష్టంగా ఉంది. రొనాల్డోతో పాటు కరీమ్ బెంజెమా (6వ స్థానం), రియాద్ మహ్రెజ్ (45వ స్థానం), సాడియో మానె (52వ స్థానం) వంటి వారు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
2025లో అత్యధిక ఆర్జన కలిగిన టాప్-10 అథ్లెట్లు
{{/usCountry}}క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్, ఫుట్‌బాల్) - 260 మిలియన్ డాలర్లు
కానెలో అల్వారెజ్ (మెక్సికో, బాక్సింగ్) - 137 మిలియన్ డాలర్లు
లియోనల్ మెస్సీ (అర్జెంటీనా, ఫుట్‌బాల్) - 130 మిలియన్ డాలర్లు
జువాన్ సోటో (డొమినికన్ రిపబ్లిక్, బేస్‌బాల్) - 129.2 మిలియన్ డాలర్లు
లెబ్రాన్ జేమ్స్ (అమెరికా, బాస్కెట్‌బాల్) - 128.7 మిలియన్ డాలర్లు
కరీమ్ బెంజెమా (ఫ్రాన్స్, ఫుట్‌బాల్) - 115 మిలియన్ డాలర్లు
స్టీఫెన్ కర్రీ (అమెరికా, బాస్కెట్‌బాల్) - 105.4 మిలియన్ డాలర్లు
షోహై ఒటాని (జపాన్, బేస్‌బాల్) - 102.5 మిలియన్ డాలర్లు
కెవిన్ డురాంట్ (అమెరికా, బాస్కెట్‌బాల్) - 100.8 మిలియన్ డాలర్లు
జాన్ రమ్ (స్పెయిన్, గోల్ఫ్) - 100.7 మిలియన్ డాలర్లు