CUET PG 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ- ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇవి..
సీయూఈటీ పీజీ 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2026 జనవరి 14వ తేదీ వరకు అప్లికేషన్ని దాఖలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో సీయూఈటీ పీజీ ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలతో పాటు ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ - సీయూఈటీ పీజీ 2026 రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. 2025 డిసెంబర్ 14న మొదలైన దరఖాస్తు ప్రక్రియ 2026 జనవరి 14న ముగియనుంది.

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో exams.nta.nic.in/cuet-pg లేదా nta.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2026 జనవరి 18 నుంచి 20 వరకు అప్లికేషన్‌లో మార్పులు చేసుకోవడానికి కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది.
సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ డైరక్ట లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీయూఈటీ పీజీ 2026 పరీక్ష వచ్చే ఏడాది మార్చ్‌లో ఉంటుంది.
సీయూఈటీ పీజీ- పరీక్ష వివరాలు..
పరీక్షా విధానం-కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)
వ్యవధి- ఒక్కో పేపర్‌కు 90 నిమిషాలు
ప్రశ్నల సంఖ్య- ఒక్కో పేపర్‌కు 75 ప్రశ్నలు
మార్కింగ్ విధానం- సరైన సమాధానానికి +4 మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్కు, ప్రయత్నించని ప్రశ్నకు 0 మార్కులు.
సీయూఈటీ పీజీ 2026 అప్లికేషన్ ఫీజు..
జనరల్- రెండు పేపర్లకు రూ. 1400- అదనపు పేపర్‌కి రూ. 700
జన్-ఈడబ్ల్యూఎస్/ఓబీసీ- ఎన్సీఎల్- రెండు పేపర్లకు రూ. 1200- అదనపు పేపర్‌కి రూ. 600
ఎస్సీ/ఎస్టీ/ థర్డ్ జండర్- రెండు పేపర్లకు రూ. 1100- అదనపు పేపర్‌కి రూ. 600
పీడబ్ల్యూడీ- రెండు పేపర్లకు రూ. 1000- అదనపు పేపర్‌కి రూ. 600
భారత దేశం వెలుపల- రెండు పేపర్లకు రూ. 7000- అదనపు పేపర్‌కి రూ. 3,500
సీయూఈటీ పీజీ 2026- క్వశ్చన్ పేపర్ కోడ్‌లు..
అభ్యర్థులు తాము ఎంచుకున్న విశ్వవిద్యాలయాలు అందించే కోర్సుల ఆధారంగా గరిష్టంగా 4 క్వశ్చన్ పేపర్ కోడ్‌లను ఎంచుకోవచ్చు.
ఎంటెక్/హయ్యర్ సైన్సెస్ పేపర్లు (ఇంగ్లీష్‌లో మాత్రమే), కొన్ని లాంగ్వేజ్/ఆచార్య పేపర్లు మినహా, ప్రశ్న పత్రాలు ద్విభాషా రూపంలో (ఇంగ్లీష్ అండ్ హిందీ) ఉంటాయి. ఒకవేళ ఏవైనా సందేహాలు లేదా తేడాలు ఉంటే, ఇంగ్లీష్ వెర్షన్‌నే ఫైనల్‌గా పరిగణిస్తారు.
- అయితే ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సరైన ఆప్షన్లు ఉంటే, సరైన ఎంపిక చేసిన వారికి +4 మార్కులు ఇస్తారు.
- ఒక ప్రశ్న రద్దు అవ్వడం లేదా చెల్లనిదిగా ప్రకటించినా, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ +4 మార్కులు లభిస్తాయి.
సీయూఈటీ పీజీ 2026- అర్హత ప్రమాణాలు..
2026 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండాలి.
వయోపరిమితి నిబంధన ఏమీ లేదు! అయితే, దరఖాస్తు చేసే ముందు, మీరు చేరాలనుకుంటున్న విశ్వవిద్యాలయ నిర్దిష్ట వయో పరిమితి నిబంధనలను తప్పక పరిశీలించాలి.
ముఖ్య గమనిక..
కోటాలు, రిజర్వేషన్లు, సబ్జెక్టుల కలయిక, అర్హతకు సంబంధించి విశ్వవిద్యాలయాల నిర్దిష్ట విధానాలే వర్తిస్తాయి.
సీయూఈటీ పీజీ పరీక్ష రాయడం అనేది ప్రవేశానికి హామీ ఇవ్వదు. సీయూఈటీ పీజీ స్కోర్‌ల ఆధారంగా ప్రవేశాల కోసం విశ్వవిద్యాలయాలు సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.
అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు విశ్వవిద్యాలయ అర్హత ప్రమాణాలను తప్పకుండా సమీక్షించాలి. సిలబస్, క్వశ్చన్ పేపర్ కోడ్‌ల కోసం exams.nta.nic.in/cuet-pg వెబ్‌సైట్‌ను సందర్శించండి.














