...
...
Next Story

Dhoot transmission share : అదరగొట్టిన ధూత్ ట్రాన్స్​మిషన్ ఐపీఓ- ఏకంగా 38శాతం లిస్టింగ్ గెయిన్స్!

Dhoot transmission listing price : ధూత్ ట్రాన్స్‌మిషన్ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్లో అద్భుతమైన అరంగేట్రం చేశాయి. ఇష్యూ ధరతో పోలిస్తే సుమారు 38 శాతం లాభంతో ట్రేడింగ్ ప్రారంభించి పెట్టుబడిదారులను అలరించాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Aug 17, 2026, 10:36:59 IST
Advertisement

ఆటో కాంపోనెంట్స్ తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన ధూత్ ట్రాన్స్‌మిషన్ ఐపీఓకు దేశీయ స్టాక్​ మార్కెట్​లో బంపర్​ లిస్టింగ్ లభించింది! ఇష్యూ ధర రూ. 871తో పోలిస్తే ఎన్ఎస్ఈలో ఒక్కో షేరు 37.77 శాతం లాభంతో రూ. 1,200 వద్ద ట్రేడింగ్​ని ప్రారంభించింది. ఇక బీఎస్ఈలో 37.06 శాతం లాభపడి రూ. 1,193.80 వద్ద ఓపెన్ అయింది.

ధూత్ ట్రాన్స్​మిషన్ ఐపీఓ లిస్టింగ్ అప్డేట్స్..
ధూత్ ట్రాన్స్​మిషన్ ఐపీఓ లిస్టింగ్ అప్డేట్స్..

ఇక సోమవారం ఉదయం 10:30 ప్రాంతంలో ధూత్​ ట్రాన్స్​మిషన్ షేరు రూ. 1,149 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ధూత్ ట్రాన్స్​మిషన్​ ఐపీఓకు బంపర్ లిస్టింగ్- కారణం..

పెట్టుబడిదారుల నుంచి ఈ ఐపీఓకి అపూర్వమైన స్పందన లభించింది. గత బుధవారంతో ముగిసిన బిడ్డింగ్ చివరి నాటికి ఈ ఇష్యూ ఏకంగా 74.21 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం రూ. 3,067 కోట్ల విలువైన ఈ ఐపీఓలో 2,49,56,363 షేర్లకు గాను ఏకంగా 1,85,19,71,585 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

విభాగాల వారీగా చూస్తే, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) కోటా 212.92 సార్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్​ఐఐ) కోటా 51.93 సార్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. అలాగే రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 8.12 సార్లు భర్తీ అయింది. పబ్లిక్ ఇష్యూకి ముందే బ్లాక్‌రాక్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రముఖ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ. 918.3 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ ధరల శ్రేణిని రూ. 829 నుంచి రూ. 871 మధ్య కంపెనీ ఖరారు చేసింది.

ధూత్ ట్రాన్స్​మిషన్​ ఐపీఓ- జీఎంపీ, ఇతర వివరాలు..

ఇష్యూకి ముందు గ్రే మార్కెట్‌లో ధూత్ ట్రాన్స్‌మిషన్ షేర్ల ప్రీమియం (జీఎంపీ) +258 వరకు నడిచింది. ప్రైస్ బ్యాండ్ గరిష్ట స్థాయి, గ్రే మార్కెట్ ప్రీమియంను బట్టి ఈ షేరు సుమారు రూ. 1,129 వద్ద లిస్ట్ అవుతుందని నిపుణులు అంచనా వేశారు. గత 15 సెషన్లుగా జీఎంపీ నిలకడగా ఊపందుకుంటూ బలమైన లిస్టింగ్‌కు సంకేతాలు ఇచ్చింది. ఈ కాలంలో జీఎంపీ రూ. 146 నుంచి రూ. 276 మధ్య కదలాడింది.

ఈ ఐపీఓ ద్వారా రూ. 1,400 కోట్ల వరకు విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేశారు. అలాగే ప్రమోటర్లు బీసీ ఏషియా ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్స్​వీ లిమిటెడ్ (ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బెయిన్ క్యాపిటల్ మద్దతు ఉన్న సంస్థ), మంగళం క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మరో 1.91 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) కింద విక్రయించారు.

తాజా ఇష్యూ ద్వారా వచ్చే నిధులను రుణాల చెల్లింపునకు, సబ్సిడరీల రుణ భారాలను తగ్గించడానికి, అలాగే హర్యానాలోని ఝజ్జర్, తమిళనాడులోని హోసూర్‌లో కొత్త వైరింగ్ హార్నెస్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. కొంత మొత్తాన్ని వ్యూహాత్మక కొనుగోళ్లు, ఇతర వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు కేటాయిస్తామని వెల్లడించింది.

ప్రైస్ బ్యాండ్ గరిష్ట స్థాయి ప్రకారం, ధూత్ ట్రాన్స్‌మిషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 17,816 కోట్లుగా ఉంటుందని అంచనా. కనిష్ట స్థాయి వద్ద ఇది సుమారు రూ. 17,025 కోట్లుగా ఉంది. ఈ పబ్లిక్ ఇష్యూకి ఆక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరించగా, కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించింది.

కంపెనీ వ్యాపార ప్రొఫైల్..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కేంద్రంగా 1999లో ఏర్పాటైన ధూత్ ట్రాన్స్‌మిషన్ సంస్థ.. ఆటోమోటివ్ రంగానికి అవసరమైన వైరింగ్ హార్నెసెస్, ఎలక్ట్రానిక్ సెన్సార్లు, కంట్రోలర్లు, ఆటోమోటివ్ స్విచ్‌లు, పవర్ కార్డ్స్, కేబుల్స్, కనెక్టర్లు, టెర్మినల్స్‌ను తయారు చేస్తోంది.

ఈ సంస్థ ఉత్పత్తులు ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, కమర్షియల్ వెహికల్స్, ఆఫ్‌రోడ్ వెహికల్స్, ఎర్త్ మూవర్స్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్స్ (వ్యవసాయ పరికరాలు), మెడికల్ డివైజెస్‌తో పాటు గృహోపకరణాల వంటి వివిధ రంగాలకు విస్తరించి ఉన్నాయి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe