దేశంలో పండుగ సీజన్ సందడి కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయులు సొంత వాహనాలను కొనేందుకు ఎగబడుతున్నారు. అదే సమయంలో ఈ సీజన్‌ను సొమ్ము చేసుకోవడానికి, కార్ల తయారీదారులు తమ అమ్మకాలను పెంచుకునేందుకు చురుకుగా పనిచేస్తున్నారు. జీఎస్టీ తగ్గింపుతో పాటు తమ బెస్ట్ సెల్లింగ్ వాహనాలపై వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి కియా మోటార్స్ సైతం చేసింది. తన ప్రసిద్ధ మోడళ్లైన సైరోస్, సోనెట్, సెల్టోస్ సహా ఇతర కార్లపై రూ. 1.60 లక్షల వరకు ప్రయోజనాలను ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఈ కియా వాహనాలపై పండుగ డిస్కౌంట్లు..
కియా సోనెట్..

కియా సోనెట్ కారుపై దీపావళి ఆఫర్ల కింద మొత్తం రూ. 1,02,700 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. సోనెట్ ధరలు రూ. 7,30,138 నుంచి ప్రారంభమవుతాయి.
కియా సైరోస్..
కియా సైరోస్ ఎస్‌యూవీలో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 118 బీహెచ్‌పీ పవర్‌ని, 172 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ డీజిల్ ఇంజిన్ 113 హెచ్‌పీ పవర్‌ని, 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇక ట్రాన్స్‌మిషన్ ఎంపికల విషయానికి వస్తే, ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 7-స్పీడ్ డీసీటీ, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటివి ఉన్నాయి.
ఈ పండుగ సీజన్ ఆఫర్‌లో, కియా సైరోస్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు రూ. 1,60,400 వరకు ప్రయోజనాలను పొందవచ్చు! సైరోస్ ధరలు రూ. 8.67 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతాయి.
కియా సెల్టోస్..
హుండాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇచ్చే కియా సెల్టోస్ కారు, ఈ పండుగ ఆఫర్‌తో మరింత ఆకర్షణీయంగా మారింది. సెల్టోస్ కొనుగోలుపై రూ. 1.47 లక్షల వరకు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది. కియా సెల్టోస్ ధరలు రూ. 10.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.
కియా క్యారెన్స్..
కియా క్యారెన్స్ మోడల్‌పై పండుగ ఆఫర్ల కింద రూ. 83,200 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ కారు ప్రారంభ ధర రూ. 10.47 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
కియా క్యారెన్స్ క్లావిస్..
{{/usCountry}}కియా క్యారెన్స్ మోడల్‌పై పండుగ ఆఫర్ల కింద రూ. 83,200 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ కారు ప్రారంభ ధర రూ. 10.47 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
కియా క్యారెన్స్ క్లావిస్..
{{/usCountry}}ఇటీవల విడుదలైన కియా క్యారెన్స్ క్లావిస్ కారు ప్రారంభ ధర రూ. 11.18 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే, రూ. 1,41,800 వరకు లభించే పండుగ ప్రయోజనాలతో, ఈ ఎస్‌యూవీ ధర కొంచెం తగ్గుతుంది, కొనుగోలుదారులకు మరింత తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది.
మరింత సమాచారం కోసం, ఈ ఆఫర్లు, ధరల వివరాలను తెలుసుకోవడానికి మీరు నేరుగా కియా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.