భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం కల్పించింది. సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 195 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఖాళీల వివరాలు

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 195 పోస్టులను భర్తీ చేయనున్నారు.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 50 పోస్టులు
- టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా): 30 పోస్టులు
- ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ - ఎన్‌సీవీటీ / ఎస్‌సీవీటీ): 115 పోస్టులు
అర్హతలు, వయోపరిమితి
2022, 2023, 2024, 2025 మరియు 2026 సంవత్సరాల్లో సంబంధిత విభాగంలో రెగ్యులర్ కోర్సు పూర్తి చేసి, కనీసం 70 శాతం మార్కులు లేదా 7.5 సీజీపీఏ సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.
అభ్యర్థుల వయస్సు 2026 సెప్టెంబరు 1 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఎంపిక విధానం
అకడమిక్ మార్కుల మెరిట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. తుది ఎంపికకు ధ్రువపత్రాల పరిశీలన తప్పనిసరి. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు దరఖాస్తులో పేర్కొన్న ఇ-మెయిల్ ద్వారా సమాచారం పంపుతారు.
ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరే సమయంలో గత ఒక ఏడాదిగా నివాసముంటున్న ప్రాంతం లేదా శాశ్వత చిరునామాకు సంబంధించిన పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్ drdo.gov.in లో నోటిఫికేషన్ పరిశీలించి, అక్టోబరు 30, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
{{/usCountry}}నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
{{/usCountry}}