DRDO recruitment : డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసిన వారికి సువర్ణావకాశం- డీఆర్డీఓలో అప్రెంటిస్ పోస్టులు..
DRDO Apprentice Recruitment 2026 : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)కు చెందిన ఎస్ఎస్పీఎల్ ల్యాబ్స్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 21, 2026 లోపు తపాలా ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. దిల్లీలోని తిమార్‌పూర్‌లో ఉన్న 'సోలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ' (ఎస్ఎస్పీఎల్)లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 21, 2026 నాటికి తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో (పోస్ట్ ద్వారా) పంపించాల్సి ఉంటుంది.

ఈ ప్రకటన ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు (12 నెలలు) ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో నిబంధనల ప్రకారం ప్రతినెల స్టైపెండ్ అందిస్తారు.
డీఆర్‌డీఓ అప్రెంటిసిస్ రిక్రూట్మెంట్ 2026- ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల్లో డిప్లొమా అప్రెంటిస్‌లకు 41 స్థానాలను కేటాయించగా, ఐటీఐ, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు కూడా ఉన్నాయి. ల్యాబొరేటరీ అవసరాలకు అనుగుణంగా ఖాళీల సంఖ్య పెరిగే లేదా తగ్గే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.
డీఆర్‌డీఓ అప్రెంటిసిస్ రిక్రూట్మెంట్ 2026- విద్యా అర్హతలు:
ITI అప్రెంటిస్: డీఆర్‌డీఓ అప్రెంటిసిస్ రిక్రూట్మెంట్ 2026 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతితో పాటు ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, మెషినిస్ట్, కార్పెంటర్ ట్రేడ్లలో ఫస్ట్ డివిజన్‌తో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
డిప్లొమా అప్రెంటిస్: పదో తరగతిలో ఫస్ట్ డివిజన్ సాధించడంతో పాటు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఫస్ట్ డివిజన్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లలో ఫస్ట్ డివిజన్‌తో బీఎస్సీ, లేదా బీఏ, బీకామ్ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, వీఎల్ఎస్ఐ, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఫస్ట్ డివిజన్‌తో బీఈ / బీటెక్ డిగ్రీ సాధించి ఉండాలి.
డీఆర్‌డీఓ అప్రెంటిసిస్ రిక్రూట్మెంట్ 2026- ఇతర అర్హత నిబంధనలు..
ఉత్తీర్ణత సంవత్సరం: 2022, 2023, 2024, 2025 లేదా 2026 సంవత్సరాల్లో రెగ్యులర్ కోర్సు ద్వారా తమ అర్హత విద్య పూర్తి చేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. 2022 కంటే ముందు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేయడానికి వీలులేదు.
పోర్టల్ నమోదు తప్పనిసరి: డిప్లొమా, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో, ఐటీఐ అభ్యర్థులు Apprenticeship India పోర్టల్‌లో ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి డీఆర్‌డీఓ అప్రెంటిసిస్ రిక్రూట్మెంట్ 2026లో రిజర్వేషన్లు వర్తిస్తాయి.
డీఆర్‌డీఓ అప్రెంటిసిస్ రిక్రూట్మెంట్ 2026- దరఖాస్తు ప్రక్రియ..
అభ్యర్థులు నిర్ణీత నమూనాలో దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, దానికి సంబంధించిన విద్యార్హతలు, సర్టిఫికేట్ల స్వయం ధృవీకరణ ప్రతిపత్రాలను జతచేసి క్రింది చిరునామాకు రిజిస్టర్డ్ / సాధారణ పోస్ట్ ద్వారా పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
Director, SSPL
Kind Attention: HRD
Solid State Physics Laboratory (SSPL)
DRDO, Lucknow Road, Timarpur, Delhi - 110054.
కాగా డీఆర్‌డీఓ అప్రెంటిసిస్ రిక్రూట్మెంట్ 2026 దరఖాస్తులు 2026 ఆగస్టు 21 నాటికి సంబంధిత కార్యాలయానికి చేరాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ లేదా తదుపరి సమాచారానికి సంబంధించిన కాల్ లెటర్లను కేవలం ఈ-మెయిల్ ద్వారా మాత్రమే పంపుతారు.
ఎంపికైన అభ్యర్థులు విధుల లో చేరే సమయంలో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
ఈ అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసినంత మాత్రాన డీఆర్‌డీఓ లేదా ఎస్‌ఎస్‌పీఎల్‌లో శాశ్వత ఉద్యోగానికి ఎలాంటి హక్కు ఉండదని గుర్తుపెట్టుకోవాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


