మైదానంలో దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. గురువారం (ఫిబ్రవరి 5) అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫొటో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ట్రైనింగ్ సమయంలో క్రికెట్ బంతి బలంగా తాకడంతో స్టోక్స్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.
"నా సంగతి సరే.. ఆ బంతిని చూడాలి మీరు"

షేర్ చేసిన ఫొటోలో.. బెన్ స్టోక్స్ కుడి కంటి కింద కమిలిపోయి వాచిపోవడాన్ని చూడవచ్చు. చెంపపై కోసుకుపోయిన గాయం, రక్తం కారకుండా ముక్కులో దూది పెట్టుకుని అతడు కనిపిస్తున్నాడు. ఇంతటి నొప్పిలోనూ అతడు తన సెన్సాఫ్ హ్యూమర్‌ను వదులుకోలేదు. "నా ముఖం ఇలా ఉంది సరే.. ఆ క్రికెట్ బంతి పరిస్థితిని మీరు చూడాలి" అంటూ నవ్వుతున్న ఎమోజీతో క్యాప్షన్ రాసుకొచ్చాడు.
వరుస గాయాలు.. ఫామ్ లేమి
బెన్ స్టోక్స్ గాయపడటం ఇంగ్లాండ్ అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నా.. అతడు తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టడం కాస్త ఊరటనిస్తోంది. అయితే గత కొంతకాలంగా స్టోక్స్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు.
జనవరి ఆరంభంలో సిడ్నీలో జరిగిన ఐదో యాషెస్ టెస్టులో ‘అడక్టర్’ గాయం అతన్ని ఇబ్బంది పెట్టింది. ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్ 1-4 తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఇక 2024లో రెండుసార్లు హ్యామ్‌స్ట్రింగ్ గాయాలు, భుజం గాయం కారణంగా భారత్‌తో జరిగిన కీలక సిరీస్‌కు దూరమయ్యాడు. అంతకుముందు మోకాలి శస్త్రచికిత్స కూడా జరిగింది.
విమర్శలు ఉన్నా.. తగ్గేదేలే..
యాషెస్ ఓటమి తర్వాత స్టోక్స్, కోచ్ మెక్‌కల్లమ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగేందుకే స్టోక్స్ మొగ్గు చూపాడు. వచ్చే సమ్మర్ వరకు అతనికి కెప్టెన్‌గా కాంట్రాక్ట్ ఉంది.
ప్రస్తుత గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. మే నెల చివర్లో న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ ద్వారా స్టోక్స్ మళ్లీ మైదానంలోకి దిగే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెలలో జరిగే 'ది హండ్రెడ్' (The Hundred) లీగ్ వేలానికి దూరంగా ఉంటూ, పూర్తిగా టెస్ట్ క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
{{/usCountry}}ప్రస్తుత గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. మే నెల చివర్లో న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ ద్వారా స్టోక్స్ మళ్లీ మైదానంలోకి దిగే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెలలో జరిగే 'ది హండ్రెడ్' (The Hundred) లీగ్ వేలానికి దూరంగా ఉంటూ, పూర్తిగా టెస్ట్ క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
{{/usCountry}}