...
...
Next Story

Fakhar Zaman: ఈ పాకిస్థాన్ ప్లేయర్స్ ఇక మారరా? బాల్ టాంపరింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన ఫఖర్ జమాన్

Fakhar Zaman: పాకిస్థాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ బాల్ టాంపరింగ్ చేస్తూ దొరికిపోయాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో భాగంగా అతడు టాంపరింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Mar 30, 2026, 17:52:25 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 2026) ఒక పెద్ద కాంట్రవర్సీ చోటు చేసుకుంది. ఆదివారం (మార్చి 29) నాడు కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ ఓపెనర్ ఫఖర్ జమాన్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. దీనివల్ల అతనిపై ఇప్పుడు కనీసం ఒక మ్యాచ్ బ్యాన్ పడే అవకాశం గట్టిగా కనిపిస్తోంది.

లాస్ట్ ఓవర్ టెన్షన్‌లో అసలేం జరిగిందంటే..

Fakhar Zaman: ఈ పాకిస్థాన్ ప్లేయర్స్ ఇక మారరా? బాల్ టాంపరింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన ఫఖర్ జమాన్
Fakhar Zaman: ఈ పాకిస్థాన్ ప్లేయర్స్ ఇక మారరా? బాల్ టాంపరింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన ఫఖర్ జమాన్

కరాచీ కింగ్స్ చేజింగ్ చేస్తున్న టైమ్‌లో 19వ ఓవర్ లాస్ట్ బాల్‌ దగ్గర బాల్ టాంపరింగ్ ఇన్సిడెంట్ జరిగింది. చివరి 6 బంతుల్లో కరాచీ గెలవడానికి 14 రన్స్ కావాలి. హరీస్ రౌఫ్ ఆ ఫైనల్ ఓవర్ వేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ టైమ్‌లో షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రౌఫ్ దగ్గర నుంచి ఫఖర్ జమాన్ బాల్ అందుకున్నాడు. బౌలర్ రనప్ ఏరియా దగ్గర వీళ్లు ముగ్గురూ గుమిగూడారు.

సరిగ్గా అదే టైమ్‌లో ఫఖర్ ఆ బంతి కండిషన్‌ను మార్చడానికి ట్రై చేసినట్లు స్పష్టంగా కనిపించింది. వెంటనే ఆన్ ఫీల్డ్ అంపైర్ ఫైసల్ ఆఫ్రిది జోక్యం చేసుకున్నాడు. కరాచీ కింగ్స్ టీమ్ అడగటంతో వెంటనే ఆ బాల్ మార్చేశారు. ఈ తప్పు చేసినందుకు లాహోర్ ఖలందర్స్‌కు అంపైర్లు 5 రన్స్ పెనాల్టీ వేశారు. దాంతో కరాచీ కింగ్స్ టార్గెట్ 6 బంతుల్లో 9 రన్స్‌కు పడిపోయింది.

ఫఖర్ జమాన్‌పై లెవెల్ 3 అఫెన్స్..

బాల్ కండిషన్‌ను మార్చడానికి ట్రై చేసినందుకు 35 ఏళ్ల ఫఖర్ జమాన్‌పై పీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.14 కింద లెవెల్ 3 అఫెన్స్ బుక్ చేశారు. లీగ్ రూల్స్ ప్రకారం ఇలా లెవెల్ 3 అఫెన్స్ కింద బుక్ అయితే ఆ ప్లేయర్‌పై కనీసం ఒక మ్యాచ్ బ్యాన్ పడుతుంది.

అయితే మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ ఆధ్వర్యంలో జరిగిన డిసిప్లినరీ హియరింగ్‌లో ఫఖర్ జమాన్ తనపై వచ్చిన ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో జరిగిన ఈ ఘటనపై మరో 48 గంటల్లో ఇంకో హియరింగ్ జరగబోతోంది. ఆ తర్వాతే మ్యాచ్ రిఫరీ తన ఫైనల్ తీర్పును వెల్లడిస్తారని బోర్డు తమ స్టేట్‌మెంట్‌లో చెప్పింది.

లాహోర్ కొంపముంచిన ఆ పెనాల్టీ..

ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ విషయానికొస్తే.. ఆడమ్ జంపా కేవలం 11 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, మొయిన్ అలీ 31 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసి అదరగొట్టారు. వీళ్ల దెబ్బకు లాహోర్ ఖలందర్స్ టీమ్ 128/9 స్కోరుకే పరిమితమైంది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో కరాచీ కింగ్స్ 129 రన్స్ టార్గెట్‌ను ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో ఈజీగా చేజ్ చేసి మ్యాచ్ గెలిచేసింది. అసలే తక్కువ స్కోర్ డిఫెండ్ చేసుకుంటున్న లాహోర్ ఖలందర్స్‌కు ఆ 5 రన్స్ పెనాల్టీ పడటం వాళ్ల కొంప ముంచిందని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe