...
...
Next Story

జూన్​ 20 : తగ్గనంటున్న బంగారం ధర, వెండి రేటు కూడా పైపైకి- తెలుగు రాష్ట్రాల్లో ప్రైజ్​ ఇలా..

దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. వెండి ధరలు కూడా వృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 20, 2025, 09:50:05 IST
By ,
Prefer HTon Google
Advertisement

దేశంలో బంగారం జూన్​ 20, శుక్రవారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 150 పెరిగి.. రూ. 1,01,243కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 10,012గా కొనసాగుతోంది.

ముంబైలోని ఒక ఆభరణాల దుకాణంలో.. (Sandeep Mahankal)
ముంబైలోని ఒక ఆభరణాల దుకాణంలో.. (Sandeep Mahankal)

మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 150 వృద్ధి చెంది.. రూ. 92,833కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 9,283గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు పెరిగాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 92,685గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,115గా ఉంది. ముంబైలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 92,687 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 1,01,117గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,681గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,111గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 92,675గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 1,01,105గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,689గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,119గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,695గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,125గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,697గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,127గా నమోదైంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 92,741గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 1,01,011గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 92,680గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,110గా ఉంది.

దేశంలో వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం దిల్లీలో.. 100 గ్రాముల వెండి ధర రూ. 11,520గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 1,15,200కి చేరింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,25,400 పలుకుతోంది. వెండి ధరలు విజయవాడలోరూ.​1,26,200.. విశాఖపట్నంలో రూ. 1,23,800గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe