గూగుల్​ జెమినీలో Deep Think ఫీచర్​- ఏంటిది? ఎవరికి ఉపయోగకరం? ఎలా వాడాలి?

లోతైన విశ్లేషణ కోసం జెమినీలో 'డీప్ థింక్' అనే కొత్త ఫీచర్​ని ప్రవేశపెట్టింది గూగుల్​. ప్రస్తుతానికి ఇది అల్ట్రా ప్లాన్​ ఉన్న వారికి అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఈ డీప్​ థింక్​ ఫీచర్​ ప్రయోజనాలు, ఎలా యాక్సెస్​ చేయాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 06, 2025 2:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వివరంగా ఆలోచించి, సంక్లిష్ట సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించడం వంటి పనులపై దృష్టి సారించే సరికొత్త ఫీచర్‌ని గూగుల్ సంస్థ జెమినీ యాప్‌లో ప్రవేశపెట్టింది. ‘జెమినీ 3 డీప్ థింక్’ పేరుతో ఈ ఫీచర్​ని విడుదల చేసింది. అల్ట్రా ప్లాన్​ కలిగి ఉన్న యూజర్లు వెంటనే దీన్ని ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా చాలా మంది ఏఐని ఫాస్ట్​ రిప్లై కోసం వాడుతుంటారు. అయితే, త్వరగా సమాధానాలు అవసరం లేని, బదులుగా పరిశీలనతో కూడిన లోతైన విశ్లేషణ అవసరమయ్యే సందర్భాల కోసం ఈ ఫీచర్​ని గూగుల్​ రూపొందించింది.

గూగుల్​ జెమినీ డీప్​ థింక్​ ఫీచర్​.. (Google)
గూగుల్​ జెమినీ డీప్​ థింక్​ ఫీచర్​.. (Google)

'డీప్ థింక్' ఎలా పనిచేస్తుంది?

గూగుల్ స్ట్రక్చర్డ్​ రీజనింగ్​తో కూడిన మునుపటి పనుల​ ఆధారంగా ఈ డీప్ థింక్​ని నిర్మించారు. ఇది వేగవంతమైన సమాధానం ఇవ్వడానికి బదులుగా, ఒకేసారి అనేక రీజనింగ్​ మార్గాలను నడుపుతుంది. ఒక ప్రశ్నలో అనేక షరతులు ఉన్నప్పుడు లేదా జవాబును.. వివిధ ఆప్షన్స్​ని పరిశీలించిన తర్వాత నిర్ణయించాల్సినప్పుడు ఈ విధానం చాలా సహాయపడుతుంది.

ఉదాహరణకు సుదీర్ఘమైన గణిత ప్రశ్నలు, క్లిష్టమైన లాజిక్ సమస్యలు లేదా క్రమబద్ధమైన దశలు అవసరమయ్యే ప్రణాళిక పనులు ఈ పద్ధతి ద్వారా ప్రయోజనం పొందుతాయి. ఈ మోడల్ అన్ని ఆప్షన్స్​ని ప్రాసెస్ చేస్తుంది. వాటిని సరిపోల్చుతుంది. సాధ్యమయ్యే మార్గాలను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ ప్రక్రియ వల్ల సిస్టమ్ తొందరపాటు చర్యలకు దూరంగా ఉండి, సుదీర్ఘమైన ఆదేశాల్లో కూడా స్థిరమైన రీజనింగ్​ని కొనసాగించడంలో సహాయపడుతుందని గూగుల్ చెబుతోంది.

జెమినీ యాప్‌లో, అల్ట్రా సబ్‌స్క్రైబర్‌లు డీప్ థింక్‌ను ఒక ఆప్షనల్​ మోడ్​గా యాక్సెస్ చేయవచ్చు. ఇది సాధారణ చాట్ ఎక్స్​పీరియెన్స్​తో పాటు ఉంటుంది. మరింత లోతైన విశ్లేషణ అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని ఆన్ చేయవచ్చు.

జెమినీ యాప్‌లో 'డీప్ థింక్'ను ఎలా ఉపయోగించాలి?

ఈ ఫీచర్‌ను ఉపయోగించేందుకు ఈ స్టెప్స్​ని అనుసరించండి:

  • మీ డివైజ్​లో జెమినీ యాప్‌ను తెరవండి.
  • మీరు సందేశాన్ని టైప్ చేసే ప్రాంప్ట్ బార్‌కు వెళ్లండి.
  • టూల్‌బార్‌లో కనిపించే “Deep Think” ఆప్షన్‌పై నొక్కండి.
  • కనిపించే మోడల్ సెలెక్టర్‌లో (Model Selector) నుంచి “Gemini 3 Pro” ని ఎంచుకోండి.

మీ ప్రశ్ని నమోదు చేయడం ప్రారంభించండి. ముఖ్యంగా బహుళ-దశల రీజనింగ్​, సుదీర్ఘ ఫారమ్‌లు లేదా స్ట్రక్చరల్​ సమస్యలు ఉన్న ప్రశ్నలను అడగండి.

మీకు సాధారణ లేదా శీఘ్ర ప్రతిస్పందనలు మాత్రమే అవసరమైతే, ఎప్పుడైనా సాధారణ మోడ్‌కు తిరిగి మారవచ్చు.

జెమినీ 3 విస్తృత రోలౌట్‌లో భాగంగా గూగుల్ డీప్ థింక్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త వెర్షన్ మల్టీమోడల్ పనులలో అప్​గ్రేడ్స్​ని కలిగి ఉంది. ఇది టెక్స్ట్, ఇమేజ్‌లు, వీడియోలు, పీడీఎఫ్‌లు, స్క్రీన్‌షాట్‌లతో మెరుగైన స్థిరత్వంతో పనిచేయడానికి మోడల్‌ను అనుమతిస్తుంది. సుదీర్ఘమైన సందర్భాలను ప్రాసెస్ చేసే, ప్రణాళికలు వేసే, సూచనలను నిర్వహించే వ్యవస్థ సామర్థ్యాన్ని కూడా కంపెనీ మెరుగుపరిచింది. తద్వారా ఎక్కువ సమయం పట్టే పనులలో కూడా వినియోగదారు లక్ష్యాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More