ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్‌లు) దాఖలు చేయడానికి గడువు సెప్టెంబర్ 15 తర్వాత పొడిగించే ప్రసక్తే లేదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ.. "ఐటీఆర్ ఫైలింగ్‌కి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025గానే ఉంది," అని తెలిపింది.
గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారనేది ఫేక్ న్యూస్ అని క్లారిఫై చేస్తూ, ఆదాయపు పన్ను శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
"వాస్తవానికి జులై 31, 2025న ముగియాల్సిన ఐటీఆర్ ఫైలింగ్ గడువును సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు. ఇప్పుడు దీనిని సెప్టెంబర్ 30 వరకు పొడిగించారని తప్పుడు మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నాయి," అని ఐటీ శాఖ పేర్కొంది.
సమయానికి సంబంధించిన అప్‌డేట్‌ల కోసం అధికారిక 'ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా' ఖాతాను మాత్రమే నమ్మాలని పన్ను చెల్లింపుదారులకు సూచించింది. ఏవైనా సందేహాలు లేదా సేవలు అవసరమైతే, 24/7 పనిచేసే హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని కోరింది.
"కాల్స్, లైవ్ చాట్స్, వెబ్‌ఎక్స్ సెషన్‌లు, ట్విట్టర్/ఎక్స్ ద్వారా మేము సహాయం అందిస్తున్నాం," అని ఆ పోస్ట్‌లో వివరించింది.
ఫేక్ న్యూస్‌లో ఉన్న నోటీసులో ఏముంది?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఐటీఆర్ దాఖలుగడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించిందని పేర్కొంటూ ఒక ఫేక్ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిస్టమ్ సంసిద్ధత, వాటాదారుల ఆందోళనలను ఈ పొడిగింపునకు కారణాలుగా ఆ నకిలీ నోటీసు పేర్కొంది.
{{/usCountry}}సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఐటీఆర్ దాఖలుగడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించిందని పేర్కొంటూ ఒక ఫేక్ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిస్టమ్ సంసిద్ధత, వాటాదారుల ఆందోళనలను ఈ పొడిగింపునకు కారణాలుగా ఆ నకిలీ నోటీసు పేర్కొంది.
{{/usCountry}}గతంలో, పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు, డేటా సరిపోలకపోవడం వంటి పలు సమస్యలు రావడంతో ఐటీఆర్ గడువును జులై 31 నుంచి సెప్టెంబర్ 15కి పొడిగించారు.
శనివారం ఐటీ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. అసెస్‌మెంట్ ఇయర్ 2025-26కి ఇప్పటికే 6 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఈ మైలురాయిని చేరుకోవడానికి సహకరించిన పన్ను చెల్లింపుదారులకు, పన్ను నిపుణులకు ఎక్స్ పోస్ట్‌లో కృతజ్ఞతలు తెలిపింది.
"పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణుల సహాయంతో 6 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్‌లు) మైలురాయిని చేరుకున్నందుకు ధన్యవాదాలు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. అసెస్‌మెంట్ ఇయర్ 2025-26కు ఇంకా ఐటీఆర్ దాఖలు చేయని వారంతా చివరి నిమిషం హడావుడిని నివారించడానికి వీలైనంత త్వరగా దాఖలు చేయండి. ఈ స్ఫూర్తిని కొనసాగిద్దాం!" అని ఆ పోస్ట్‌లో పేర్కొంది.
ఐటీఆర్ దాఖలు చేయడానికి సోమవారం చివరి రోజు కావడంతో, గడువులోగా రిటర్న్స్ దాఖలు చేసి, జరిమానాలను నివారించాలని ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారులకు పదేపదే గుర్తు చేస్తోంది.
ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలి? అని తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.