Hero Splendor Plus : హీరో స్ల్పెండర్ ప్లస్ ధర పెంపు- వేరియంట్లు, వాటి కొత్త రేట్ల వివరాలు..
భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ 'హీరో స్ల్పెండర్ ప్లస్' ధరను కంపెనీ స్వల్పంగా పెంచింది. ఈ నేపథ్యంలో హీరో స్ల్పెండర్ ప్లస్ వేరియంట్లు, వాటి కొత్త ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారతీయ ద్విచక్ర వాహన రంగంలో మూడు దశాబ్దాలుగా చెక్కుచెదరని బ్రాండ్ ఇమేజ్ ఏదైనా ఉందంటే అది 'హీరో స్ల్పెండర్' అని చెప్పుకోవాలి. ఎక్కడికైనా వెళ్లగలిగే ధైర్యం, అద్భుతమైన మైలేజీ ఇచ్చే గుణం వల్ల దీన్ని అభిమానులు ముద్దుగా 'లార్డ్ స్ల్పెండర్' అని కూడా పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు బెస్ట్ సెల్లింగ్ స్ల్పెండర్ ప్లస్ బైక్ ధర స్వల్పం పెరిగింది. విడిభాగాల తయారీ ఖర్చు పెరగడంతోనే ఈ బైక్ ధరను సవరిస్తున్నట్లు హీరో సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హీరో స్ల్పెండర్ ప్లస్ వేరియంట్లు, వాటి కొత్త ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హీరో స్ల్పెండర్ ప్లస్- ధరలో మార్పు ఎంత?
సాధారణంగా ధరల పెంపు అంటే వేలల్లో ఉంటుందని మనం భయపడుతుంటాము. కానీ హీరో సంస్థ తన కస్టమర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేవలం రూ. 250 మాత్రమే పెంచింది! ఈ నామమాత్రపు పెంపు వల్ల మధ్యతరగతి కొనుగోలుదారులపై పెద్దగా భారం పడదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిన్న మార్పుతో బైక్ విలువను, నాణ్యతను కాపాడటం కంపెనీ ప్రధాన ఉద్దేశం.
హీరో స్ల్పెండర్ ప్లస్- వేరియంట్లు, వాటి కొత్త ధరలు (ఎక్స్‌షోరూం)..
డ్రమ్- రూ. 74,152
ఐ3ఎస్- రూ. 75,305
125 మిలియన్- రూ. 76,437
ఎక్స్‌టెక్- రూ. 77,678
ఎక్స్‌టెక్ 2.0 (డ్రమ్)- రూ. 80,214
ఎక్స్‌టెక్ 2.0 (డిస్క్)- రూ. 80,721
- కొత్త అవతారంలో బజాజ్ పల్సర్ 125.. త్వరలోనే లాంచ్! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
హీరో స్ల్పెండర్ ప్లస్- ఇంజిన్, పెర్ఫార్మెన్స్..
ధర పెరిగినప్పటికీ, ఈ బైక్ పనితీరులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎంతో కాలంగా నమ్మకానికి మారుపేరుగా నిలిచిన అదే 100సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను సంస్థ కొనసాగిస్తోంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది.
పవర్: 7.09 బీహెచ్పీ
టార్క్: 8.05 ఎన్ఎం
ఇక ప్రయాణం సౌకర్యవంతంగా ఉండటం కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.
ఈ మెకానికల్ సెటప్ సామాన్యుడి రోజువారీ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది.
హీరో స్ల్పెండర్ ప్లస్- మార్కెట్ పరిస్థితి..
2025 ప్రారంభంలో స్ల్పెండర్ ప్లస్ బేస్ వేరియంట్ ధర రూ. 80,000 మార్కును తాకింది. అయితే 2025 సెప్టెంబర్‌లో 'జీఎస్టీ 2.0' అమల్లోకి రావడంతో ధరలు కొంత తగ్గాయి. ఇప్పుడు జరిగిన ఈ స్వల్ప ధర సవరణ అనేది పెరిగిన ఉత్పత్తి వ్యయాలను సమతుల్యం చేయడానికి తీసుకున్న నిర్ణయమేనని స్పష్టమవుతోంది.
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కమ్యూటర్ బైక్‌గా స్ల్పెండర్ ప్లస్ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఎన్ని కొత్త మోడళ్లు వచ్చినా, హీరో స్ల్పెండర్ పట్ల భారతీయులకున్న నమ్మకం మాత్రం అస్సలు తగ్గడం లేదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


