2026 Bajaj Pulsar 125 : కొత్త అవతారంలో బజాజ్ పల్సర్ 125.. త్వరలోనే లాంచ్!
బజాజ్ ఆటో తన పాపులర్ మోడల్ పల్సర్ 125ను సరికొత్త హంగులతో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. 2026 బజాజ్ పల్సర్ 125లో ఎల్‌ఈడీ లైటింగ్, గ్రాఫిక్స్ సహా అనేక మార్పులు కనిపించబోతున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
బజాజ్ పల్సర్.. తెలుగు రాష్ట్రాల్లో కుర్రాళ్ల నుంచి ఉద్యోగుల వరకు ఈ పేరు వింటేనే ఒక తెలియని క్రేజ్. ఇప్పటికే పల్సర్ 150 మోడల్‌ను అప్‌డేట్ చేసిన బజాజ్, ఇప్పుడు తన బుజ్జి పల్సర్ అంటే 'పల్సర్ 125'ను కూడా సరికొత్తగా ముస్తాబు చేస్తోంది. దాదాపు 2010 తర్వాత క్లాసిక్ పల్సర్ సిరీస్‌లో వస్తున్న అతిపెద్ద మార్పులు ఇవే కావడం విశేషం.

షోరూమ్‌లకు చేరుతున్న 2026 పల్సర్ 125..
అధికారికంగా విడుదల కావడానికి ముందే 2026 పల్సర్ 125 బైకులు డీలర్షిప్ షోరూమ్స్ వద్ద సందడి చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక వాక్-అరౌండ్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బైక్ డిజైన్, ఫీచర్లలో జరిగిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
2026 బజాజ్ పల్సర్ 125- క్లాసిక్ లుక్.. ఆధునిక టచ్
ప్రస్తుతం పల్సర్ కుటుంబంలో ఎన్ఎస్, ఎన్ సిరీస్ మోడల్స్ ఎంత ట్రెండీగా ఉన్నా, సాధారణ మధ్యతరగతి ప్రజలు మాత్రం 'క్లాసిక్ పల్సర్' వైపే మొగ్గు చూపుతారు. తక్కువ ఖర్చు, నమ్మకమైన పనితీరు, సరసమైన ధర దీనికి ప్రధాన కారణం. ఈ క్లాసిక్ రేంజ్‌లో ఉన్న పల్సర్ 220, 150 మోడల్స్ తరహాలోనే ఇప్పుడు 125 వెర్షన్‌ను కూడా బజాజ్ అప్‌డేట్ చేస్తోంది.
ఈ కొత్త పల్సర్ 125లో అందరినీ ఆకట్టుకునే ప్రధాన మార్పు హెడ్‌లైట్! మొట్టమొదటిసారిగా 125సీసీ సెగ్మెంట్లో బజాజ్ 'ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్'ను పరిచయం చేసింది. దీనివల్ల బైక్ లుక్ ఒక్కసారిగా మారిపోయింది. కేవలం హెడ్‌లైట్ మాత్రమే కాదు, ఇండికేటర్లను కూడా ఎల్‌ఈడీలుగా మార్చడంతో బైక్ మరింత ప్రీమియంగా కనిపిస్తోంది. అయితే, దశాబ్దాలుగా పల్సర్ బ్రాండ్‌కు గుర్తుగా నిలిచిన వెనుక వైపు ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
- టాటా పంచ్ ఈవీకి పోటీగా Vinfast VF5- 326 కి.మీ రేంజ్! ఎలక్ట్రిక్ కారు ధర వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
డిజైన్ విషయానికి వస్తే.. ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, ఇంజిన్ కౌల్ మీద కొత్త గ్రాఫిక్స్ వేయడంతో బైక్ పాతదనే ఫీలింగ్ కలగకుండా జాగ్రత్త పడింది బజాజ్. తక్కువ బడ్జెట్‌లో పల్సర్ బైక్ కొనాలనుకునే వారికి, నిత్యం ఆఫీసు పనుల కోసం వాడే వారికి ఈ అప్‌డేటెడ్ వెర్షన్ ఒక మంచి ఆప్షన్ కానుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా తన క్లాసిక్ గుర్తింపును కోల్పోకుండా, సరికొత్త ఫీచర్లను జోడించి బజాజ్ పల్సర్ 125ను మళ్లీ పోటీలోకి తెచ్చింది.
ఈ మోడల్ లాంచ్, ధర సహ ఇతర ఫీచర్ల వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. వీటిపై కంపెనీ త్వరలోనే స్పందించే అవకాశం ఉంది.
కాగా ప్రస్తుతం ఉన్న బజాజ్ పల్సర్ 125 మోడల్ దాదాపు రూ. 82 వేలు ఉంది. ఇక కొత్తగా లాంచ్ అయ్యే మోడల్ ధర కాస్త ఎక్కువ ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


