...
...
Next Story

Bikes under 1 lakh : 3 బడ్జెట్​ ఫ్రెండ్లీ బైక్స్- దేని ఈఎంఐ తక్కువ? మధ్యతరగతి వారికి ఏది బెస్ట్?

దేశంలో అత్యంత ఆదరణ పొందిన 100 సీసీ బైకులైన హీరో స్ల్పెండర్ ప్లస్, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 బైకుల్లో ఏది ఎంచుకోవాలో అర్థం కావడం లేదా? అయితే ఇది మీకోసమే! వీటి నెలవారీ ఈఎంఐ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Published on: Aug 24, 2026, 17:02:09 IST
Advertisement

భారతీయ టూ-వీలర్ మార్కెట్లో 100 సీసీ ఎంట్రీ-లెవెల్ బైకులకు ఉండే క్రేజే వేరు. తక్కువ ధర, అద్భుతమైన మైలేజీ, రోజువారీ ప్రయాణానికి ఎంతో అనుకూలంగా ఉండటంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ సెగ్మెంట్‌లో హీరో స్ల్పెండర్ ప్లస్, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 బైకులు టాప్‌లో ఉన్నాయి. మరి.. నమ్మకానికి మారుపేరైన హీరో స్ల్పెండర్, బడ్జెట్ ఫ్రెండ్లీ హోండా షైన్, లాంగ్ రైడ్ కంఫర్ట్ ఇచ్చే బజాజ్ ప్లాటినాలో ఏది కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ మూడు బైకులకు నెలవారీ ఈఎంఐ ఎంత పడుతుందో ఇక్కడ చూద్దాము..

3 బడ్జెట్​ బైకులు- వాటి వేరియంట్లు, ధరల వివరాలు..

హీరో స్ల్పెండర్ ప్లస్ vs హోండా షైన్ 100 vs బజాజ్ ప్లాటీనా 100
హీరో స్ల్పెండర్ ప్లస్ vs హోండా షైన్ 100 vs బజాజ్ ప్లాటీనా 100
హీరో స్ల్పెండర్ ప్లస్ vs హోండా షైన్ 100 vs బజాజ్ ప్లాటీనా 100: నెలవారీ ఈఎంఐలు ఇలా..
మోడల్, వేరియంట్లోన్ (100% ఎక్స్​షోరూం ధర)వడ్డీ రేటురీపేమెంట్ టెన్యూర్నెలవారీ ఈఎంఐ
Hero Splendor Plusరూ. 77,7779.5%24 నెలలురూ. 3,571
Hero Splendor Plus Xtecరూ. 81,213రూ. 3,729
Hero Splendor Xtec 2.0రూ. 83,414రూ. 3,830
Honda Shine 100రూ. 65,642రూ. 3,014
Honda Shine 100 DXరూ. 72,146రూ. 3,313
Bajaj Platina 100రూ. 72,942రూ. 3,349
View All

ఈ మూడు పాపులర్ మోడళ్ల ఈఎంఐ లెక్కలను అంచనా వేయడానికి వాటి అన్ని వేరియంట్లను పరిగణలోకి తీసుకోవడం జరిగింది.

హీరో స్ల్పెండర్ ప్లస్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం.. స్ల్పెండర్ ప్లస్ రూ. 77,777, స్ల్పెండర్ ప్లస్ ఎంటెక్ వెర్షన్ రూ. 81,213, అలాగే స్ల్పెండర్ ప్లస్ ఎంటెక్ 2.0 ధర రూ. 83,414గా ఉంది.

ఈ లోన్ లెక్కింపు కోసం ఎక్స్-షోరూమ్ ధరపై నూటికి నూరు శాతం రుణ మొత్తాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అలాగే రీపేమెంట్ టెన్యూర్ 24 నెలలు (రెండేళ్లు), వడ్డీ రేటు 9.5 శాతంగా అంచనా వేశారు.

ఈ లెక్కల ప్రకారం.. హీరో స్ల్పెండర్ ప్లస్ ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి నెలకు రూ. 3,571 నుంచి రూ. 3,830 వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అదే హోండా షైన్ 100 అయితే వేరియంట్‌ను బట్టి నెలకు రూ. 3,014 నుంచి రూ. 3,313 వరకు పడుతుంది. ఇక బజాజ్ ప్లాటినా 100 బైకుకు నెలవారీ ఈఎంఐ సుమారు రూ. 3,349 వరకు ఉంటుంది.

గమనిక- అయితే మీరు ఎంచుకునే వేరియంట్, డౌన్ పేమెంట్ మొత్తం, తీసుకునే లోన్ అమౌంట్, వడ్డీ రేటు, రుణం చెల్లించే కాలపరిమితిని బట్టి ఈఎంఐ మొత్తాలు మారుతుంటాయని గమనించాలి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe