హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఇంజినీరింగ్ దిగ్గజం స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (SETL) బిజినెస్ మార్కెట్‌లో ఒక సంచలన డీల్ అనౌన్స్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ జీస్కేల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఏకంగా 51 శాతం మెజారిటీ ఈక్విటీ వాటాను కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇండియాలోని ఏఐ డేటా సెంటర్ మార్కెట్ రూపురేఖలను పూర్తిగా మార్చేయబోతోంది. ఫార్మా, కెమికల్ పరిశ్రమలకు టర్న్‌కీ ప్లాంట్స్ నిర్మించడంలో దశాబ్ద కాలంగా అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న ఎస్ఈటీఎల్.. ఇప్పుడు డైరెక్ట్‌గా గ్లోబల్ ఏఐ డేటా సెంటర్ రేసులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇంజినీరింగ్ డీఎన్ఏ ఒక్కటే.. అప్లికేషన్స్ మాత్రమే వేరు!
ఈ మెగా డీల్ వెనుక ఒక పవర్‌ఫుల్ బిజినెస్ లాజిక్ ఉంది. ఎస్ఈటీఎల్ గత పదేళ్లుగా ఫార్మా, బయోటెక్నాలజీ కంపెనీల కోసం హై-ఎండ్ కూలింగ్ స్కిడ్స్, హీట్ ఎక్స్ఛేంజర్స్, వ్యాక్యూమ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ నెట్‌వర్క్స్, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ (AHUs) లాంటి మిషన్-క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విజయవంతంగా నిర్మిస్తోంది. ఒక ఫార్మా ప్లాంట్‌కు ఎంతటి పవర్‌ఫుల్ థర్మల్ కంట్రోల్, పర్ఫెక్ట్ ఆటోమేషన్ అవసరమో.. ఒక మోడ్రన్ ఏఐ డేటా సెంటర్‌కు కూడా సరిగ్గా అలాంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీనే కావాలి.
ఇప్పటివరకు కెమికల్ రియాక్టర్ల కోసం కూలింగ్ సిస్టమ్స్ డిజైన్ చేసిన ఎస్ఈటీఎల్ ఎక్స్‌పర్ట్స్.. ఇకపై జీస్కేల్ ఎనర్జీ సపోర్ట్‌తో ఏఐ జీపీయూ (GPU) క్లస్టర్స్ కోసం నెక్స్ట్ లెవెల్ లిక్విడ్ కూలింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయబోతున్నారు. అప్లికేషన్స్ వేరైనా ఈ రెండు ప్లాట్‌ఫామ్స్ ఇంజినీరింగ్ డీఎన్ఏ ఒక్కటే కావడం విశేషం.
డేటా సెంటర్ లెజెండ్ కాసు బ్రహ్మారెడ్డి లీడర్‌షిప్
జీస్కేల్ ఎనర్జీ కంపెనీకి మన దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ డేటా సెంటర్ ఇంజినీర్ అయిన కాసు బ్రహ్మారెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఇండియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ బిజినెస్ గ్రూప్ అయిన 'కంట్రోల్ ఎస్' (CtrlS) కంపెనీకి గతంలో ఆయన ప్రెసిడెంట్‌గా వర్క్ చేశారు. క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న కాసు బ్రహ్మారెడ్డి.. ఇప్పటివరకు ఏకంగా 486 మెగావాట్స్ (MW) డేటా సెంటర్ కెపాసిటీని డెలివరీ చేశారు. మరో 1 గిగావాట్ (GW) ప్రాజెక్ట్స్ ప్రస్తుతం ఆయన పర్యవేక్షణలో అమలు దశలో ఉన్నాయి.
{{/usCountry}}జీస్కేల్ ఎనర్జీ కంపెనీకి మన దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ డేటా సెంటర్ ఇంజినీర్ అయిన కాసు బ్రహ్మారెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఇండియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ బిజినెస్ గ్రూప్ అయిన 'కంట్రోల్ ఎస్' (CtrlS) కంపెనీకి గతంలో ఆయన ప్రెసిడెంట్‌గా వర్క్ చేశారు. క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న కాసు బ్రహ్మారెడ్డి.. ఇప్పటివరకు ఏకంగా 486 మెగావాట్స్ (MW) డేటా సెంటర్ కెపాసిటీని డెలివరీ చేశారు. మరో 1 గిగావాట్ (GW) ప్రాజెక్ట్స్ ప్రస్తుతం ఆయన పర్యవేక్షణలో అమలు దశలో ఉన్నాయి.
{{/usCountry}}గ్లోబల్ హైపర్‌స్కేలర్ కంపెనీలతో ఆయనకున్న వ్యక్తిగత సంబంధాలు, ఇప్పటికే చేతిలో ఉన్న ఎల్‌ఓఐలు (LOIs) ఎస్ఈటీఎల్ కంపెనీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్‌గా మారబోతున్నాయి. పవర్ సిస్టమ్స్, పీడీయూలు (PDUs), ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన పూర్తి ఎండ్-టు-ఎండ్ ఏఐ డేటా సెంటర్లను కాన్సెప్ట్ నుంచి కమిషనింగ్ వరకు సింగిల్ ప్లాట్‌ఫామ్‌పై అందించే దేశంలోనే తొలి వర్టికల్ ఇంటిగ్రేటెడ్ హౌస్‌గా జీస్కేల్ నిలవనుంది.
2030 నాటికి రూ. 4 లక్షల కోట్ల అద్భుతమైన మార్కెట్ అవకాశం
గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం ఏఐ డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5.2 నుంచి 6.7 ట్రిలియన్ డాలర్ల క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ జరగబోతోంది. ఒక్క ఇండియాలోనే ఏఐ, హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల విభాగంలో 2030 కల్లా 28% సీఏజీఆర్ (CAGR) వృద్ధి రేటుతో సుమారు 40 నుంచి 50 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4 లక్షల కోట్లు) భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
రూ. 500 కోట్ల పెట్టుబడి ప్రణాళిక
ఎస్ఈటీఎల్ కంపెనీ అత్యంత బలమైన ఆర్థిక పురోగతి సాధిస్తూ.. ఈ డీల్‌ను పూర్తి చేసింది. ఆర్థిక సంవత్సరం 2026 ముగిసేసరికి కంపెనీ ఏకంగా రూ. 793 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో ఎబిటా (EBITDA) మార్జిన్ 17.4 శాతంగా నమోదైంది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (CRISIL) కూడా ఈ కంపెనీ రేటింగ్‌ను 'A/Positive' కి అప్‌గ్రేడ్ చేసింది.
ఈ మెగా ప్రాజెక్ట్ కోసం వేర్వేరు దశలలో మొత్తం రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టేలా డిజైన్ చేశారు. దీనికోసం ఎలాంటి బ్యాంక్ లోన్స్ తీసుకోకుండా పూర్తిగా కంపెనీ సొంత నిర్వహణ ఖర్చుల నుంచే నుంచే ఖర్చు చేస్తుండటం విశేషం. తొలి దశలో రూ. 190 కోట్లు కేటాయించారు. నవంబర్ 2026 నుంచి తయారీ పనులు ప్రారంభం కానుండగా.. ఆర్థిక సంవత్సరం 2027లోని కేవలం మొదటి నాలుగు నెలల్లోనే జీస్కేల్ కంపెనీ రూ. 250 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఎస్ఈటీఎల్ కోర్ ఇంజినీరింగ్ బిజినెస్ కూడా 2027 ఆర్థిక సంవత్సరంలో 40-50% ఆదాయ వృద్ధి సాధించే దిశగా దూసుకుపోతోంది.