Hyundai Ionic V : 600 కి.మీ రేంజ్‌తో హుందాయ్ ఐయోనిక్ వీ ఎంట్రీ- ఫీచర్లు అదుర్స్!
Hyundai electric car : హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు చైనాలో లాంచ్ అయ్యింది. అత్యాధునిక ఫీచర్లు దీని సొంతం. అంతేకాదు ఇదొక లాంగ్ రేంజ్ ఈవీ. ఈ నేపథ్యంలో ఈ మోడల్ రేంజ్, ఫీచర్లు సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ అయిన చైనాలో తన పట్టును పెంచుకునేందుకు హ్యుందాయ్ మోటార్స్ సిద్ధమైంది. బీజింగ్‌లో జరుగుతున్న 'ఆటో చైనా 2026' వేదికగా ఐయోనిక్ వీ అనే సరికొత్త ఎలక్ట్రిక్ సెడాన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. కేవలం చైనా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన ఈ కారు, హుందాయ్ వీనస్ కాన్సెప్ట్ ఆధారంగా తయారైంది.

చైనా మార్కెట్‌లో టెస్లా మోడల్ 3. బీవైడీ సీల్ వంటి ఎలక్ట్రిక్ దిగ్గజాలకు పోటీగా హుందాయ్ ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. రాబోయే ఐదేళ్లలో చైనాలో 20 కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను లాంచ్ చేయాలనే లక్ష్యంలో భాగంగా ఐయోనిక్ వీ మొదటి అడుగు.
డిజైన్: ఫ్యూచరిస్టిక్ లుక్..
ఐయోనిక్ వీ హ్యుందాయ్‌కి చెందిన కొత్త డిజైన్ లాంగ్వేజ్ “ది ఆరిజిన్” ఆధారంగా రూపొందింది.
కొలతలు: 4,900 ఎంఎం పొడవు, 1,890 ఎంఎం వెడల్పు, 2,900 ఎంఎం వీల్‌బేస్‌తో ఈ కారు రోడ్డుపై చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.
ఫీచర్లు: ఈ ఎలక్ట్రిక్ కారులో ఫ్రేమ్‌లెస్ డోర్లు, ఆకట్టుకునే ఫుల్-ఎల్ఈడీ లైటింగ్, మరియు స్పోర్టీ లుక్ కోసం లో-ప్రొఫైల్ టైర్లను అమర్చారు. దీని కూపే లాంటి రూఫ్ లైన్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
ఇంటీరియర్: 'లివింగ్ రూమ్' లాంటి అనుభూతి!
ఈ హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు లోపల అత్యంత విలాసవంతంగా ఉంటుంది.
డిస్‌ప్లే: డాష్‌బోర్డ్ అంతటా విస్తరించి ఉన్న 27- ఇంచ్ 4కే పనోరమిక్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణ. ఇది ఇన్‌ఫోటైన్‌మెంట్, వాహన సమాచారాన్ని అందిస్తుంది.
స్పేస్: 2.9 మీటర్ల భారీ వీల్‌బేస్ కారణంగా, లోపల కూర్చునే వారికి అద్భుతమైన లెగ్‌రూమ్ లభిస్తుంది. ముందు వరుసలో 1,078 ఎంఎం, వెనుక వరుసలో 1,019 ఎంఎం లెగ్‌రూమ్‌తో ఇది తన విభాగంలోనే టాప్ అని హ్యుందాయ్ పేర్కొంది.
టెక్నాలజీ: 8-స్పీకర్ల డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8295 చిప్‌సెట్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.
రేంజ్, బ్యాటరీ..
చైనాకు చెందిన సీఏటీఎల్ కంపెనీ సరఫరా చేసే బ్యాటరీలను ఈ హ్యుందాయ్ ఐయోనిక్ వీ ఎలక్ట్రిక్ కారులో వాడుతున్నారు.
రేంజ్: లాంగ్ రేంజ్ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ (సీఎల్టీసీ సైకిల్) దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఛార్జింగ్: 800-వోల్ట్ ఆర్కిటెక్చర్‌పై ఇది పనిచేస్తుంది, దీనివల్ల చాలా వేగంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు.
సేఫ్టీ: చైనా రోడ్లకు తగినట్లుగా..
భద్రత విషయంలో హ్యుందాయ్ ఎక్కడా రాజీ పడలేదు. ఈ కారులో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, రీఇన్ఫోర్స్డ్ బాడీ స్ట్రక్చర్‌ను అందించారు. చైనాకు చెందిన ‘మోమెంటా’ అనే టెక్ సంస్థతో కలిసి అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్)ను అభివృద్ధి చేశారు. ఇది అక్కడి ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా డ్రైవింగ్‌ను సులభతరం చేస్తుంది.
కేవలం చైనా కోసమే రూపొందించడం వల్ల ఈ మోడల్ భారత్‌తో సహా ఇతర దేశాల్లో లాంచ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


