New cars : హ్యుందాయ్ నుంచి డబుల్ ధమాకా! ఇండియాలోకి ఎస్​యూవీతో పాటు ఈవీ ఎంట్రీ..

భారత మార్కెట్లో తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు హ్యుందాయ్ మోటార్స్ సిద్ధమైంది. క్రెటాకు దిగువన ఒక సరికొత్త మిడ్‌సైజ్ ఎస్‌యూవీని, టాటా పంచ్ ఈవీకి పోటీగా ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. వివరాలు ఇవే..

Published on: Aug 2, 2026, 06:46:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ రంగాన్ని ఊపేస్తున్న ఎస్‌యూవీ విభాగంలో తన పట్టును మరింత బిగించేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్ ఇండియా' పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. విభిన్న ఇంజిన్, ఇంధన ఆప్షన్లతో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల నిర్వహించిన ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా.. రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో రెండు సరికొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయబోతున్నట్లు సౌత్ కొరియన్ ఆటో దిగ్గజం అధికారికంగా ధ్రువీకరించింది. అందులో ఒకటి మిడ్‌సైజ్ ఎస్‌యూవీ కాగా, మరొకటి ఆల్-ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ!

హ్యుందాయ్ నుంచి కొత్త కార్లు.. (REUTERS)
హ్యుందాయ్ నుంచి కొత్త కార్లు.. (REUTERS)

ధర, పొడవు పరంగా చూస్తే.. ఇది కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ క్రెటా కంటే కాస్త దిగువన ఉంటుంది. అయితే క్రెటాను నిలిపివేయకుండా, ఈ కొత్త ఎస్‌యూవీని దానితో పాటు సమాంతరంగా విక్రయిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

స్పెసిఫికేషన్లు, సీఎన్జీ సాంకేతికత..

ఈ కొత్త ఎస్‌యూవీ (Bc4i) పొడవు 4.18 మీటర్లుగా ఉండనుంది. దీనిని పెట్రోల్ తో పాటు సీఎన్జీ ఆప్షన్లలో కూడా తీసుకురానున్నారు.

పెట్రోల్ వేరియంట్: నమ్మకమైన 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించనున్నారు. ఇది మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

సీఎన్జీ వేరియంట్: ఇదే 1.5ఎల్ పెట్రోల్ ఇంజిన్‌కు కంపెనీ ఫిటెడ్ సీఎన్జీ కిట్‌ను జత చేయనున్నారు. అయితే కస్టమర్ల లగేజ్ రవాణాకు ఇబ్బంది లేకుండా, సీఎన్జీ సిలిండర్‌ను కారు అడుగుభాగంలో అమర్చడం ఈ కారు ప్రధాన ప్రత్యేకత. దీనివల్ల బూట్ స్పేస్ (లగేజ్ స్థలం) ఏమాత్రం తగ్గదు.

టాటా పంచ్ ఈవీకి పోటీగా 'హ్యుందాయ్ ఈవీ'!

ఇక ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రస్తుతం రారాజుగా ఏలుతున్న 'టాటా పంచ్ ఈవీ'కి గట్టి పోటీ ఇచ్చేందుకు హ్యుందాయ్ మరో ప్లాన్ చేసింది. 'HE1i' అనే కోడ్‌నేమ్‌తో ఒక కంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే విదేశీ మార్కెట్లలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ‘హ్యుందాయ్ ఇన్​స్టర్’ ఆధారంగా ఈ ఈవీ రూపొందుతున్నట్లు స్పై షాట్స్ స్పష్టం చేస్తున్నాయి.

డిజైన్ పరంగా ఇది టాల్‌బాయ్, నిటారైన స్టాన్స్‌తో రానుంది. ముందుభాగంలో క్లోజ్డ్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌లాంప్స్, పైభాగంలో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఆకర్షణీయమైన వీల్ ఆర్చ్‌లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, బాక్స్ షేప్‌లో ఉండే వెనుక టెయిల్‌గేట్ దీనికి ప్రత్యేక లుక్‌ను ఇస్తాయి.

ప్రీమియం ఫీచర్లు.. అధునాతన క్యాబిన్!

ఇంటీరియర్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా రహస్యంగా ఉంచినప్పటికీ, విభాగంలోనే అత్యుత్తమ ఫీచర్లను అందించబోతున్నట్లు సమాచారం.

క్యాబిన్ ఫీచర్లు: వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో కూడిన డ్యూయల్ స్క్రీన్ సెటప్, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో- యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ రానున్నాయి.

టెక్నాలజీ, సేఫ్టీ: హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఓటిఏ అప్‌డేట్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) వంటి అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లను ఇందులో జోడించనున్నారు.

భారతీయ ఎస్‌యూవీ మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు హ్యుందాయ్ వేస్తున్న ఈ అడుగులు ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More