ఐసీఏఐ సీఏ ఫలితాలు విడుదల: ఫైనల్, ఇంటర్, ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చేశాయి..
సీఏ సెప్టెంబర్ 2025 ఫలితాలను తాజాగా విడుదల చేసింది ఐసీఏఐ. వాటిని ఎలా చెక్ చేసుకోవాలి? ఈసారి ఎంత మంద ఉత్తీర్ణత సాధించారు? టాపర్స్ ఎవరు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సీఏ సెప్టెంబర్ 2025 పరీక్షా ఫలితాలను ఎట్టకేలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ (ఐసీఏఐ). దీనితో సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, ఫౌండేషన్ అభ్యర్థుల ఎదురుచూపులు ముగిశాయి. ఊహించిన సమయం కంటే ముందుగానే నవంబర్ 3న ఫలితాలను ప్రకటించింది ఐసీఏఐ.

సీఏ సెప్టెంబర్ 2025 ఫలితాలను ఎక్కడ తనిఖీ చేయాలి?
సీఏ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ పాస్ లేదా ఫెయిల్ స్టేటస్, మార్క్స్-స్టేట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. దీని కోసం ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలి:
- icai.org
- icai.nic.in
సీఏ సెప్టెంబర్ 2025 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1- అధికారిక వెబ్‌సైట్ icai.nic.in ను సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో, 'సీఏ సెప్టెంబర్ 2025 ఫలితాలు' తనిఖీ చేసే లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- లాగిన్ అవ్వడానికి మీ క్రిడెన్షియల్స్ని నమోదు చేసి, సబ్మిట్ చేయండి.
స్టెప్ 4- స్క్రీన్‌పై వచ్చిన ఫలితాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి.
స్టెప్ 5- ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.
స్టెప్ 6- భవిష్యత్తు అవసరాల కోసం దాని ప్రింటవుట్ కాపీని తప్పనిసరిగా భద్రపరుచుకోండి.
సీఏ సెప్టెంబర్ 2025- ముఖ్యమైన గణాంకాలు..
సీఏ ఫైనల్ ఫలితాలు-
- గ్రూప్ 1కి 51,955 మంది విద్యార్థులు హాజరవ్వగా, వీరిలో 12,811 మంది ఉత్తీర్ణత సాధించారు. పాస్ పర్సెంటేజీ 24.66%.
- గ్రూప్2కి 32,273 మంది హాజరవ్వగా.. 8,151 మంది పాస్ అవ్వడంతో 25.26శాతం పాస్ పర్సెంటేజ్ నమోదైంది.
- 16,800 మంది రెండు గ్రూప్‌లను రాయగా, వీరిలో 2,727మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 16.2గా ఉంది.
సీఏ ఇంటర్మీడియట్ ఫలితాలు-
- గ్రూప్ 1 పరీక్షను 93,074 మంది రాయగా.. 8,780 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 9.43%గా ఉంది.
- గ్రూప్ 2 పరీక్షకు 69,768 మంది హాజరయ్యారు. వీరిలో 18,938 మంది (27.14% ఉత్తీర్ణత శాతం) పాసయ్యారు.
- రెండు గ్రూప్‌లు రాసిన వారు 36,398 మంది. వీరిలో 3,663 మంది పాసయ్యారు. పాస్ పర్సెంటేజ్ 10.06%గా ఉంది.
70శాతం, అంతకన్నా ఎక్కువ సాధించిన విద్యార్థులను డిస్టింక్షన్లో పాసైనట్టు గుర్తిస్తారు. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ గ్రూప్‌లను క్లియర్ చేయలేని అభ్యర్థులు తదుపరి పరీక్షలకు మళ్లీ హాజరుకావాల్సి ఉంటుంది.
సీఏ సెప్టెంబర్ ఫలితాలు- టాపర్స్ జాబితా ..
సీఏ ఫైనల్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన అగ్రశ్రేణి అభ్యర్థుల వివరాలు:
- ముకుంద్ అగీవాల్ (ధమ్నోద్): 500 స్కోర్ (83.33% మార్కులు)
- తేజస్ ముండాదా (హైదరాబాద్): 492 స్కోర్ (82% మార్కులు)
- బకుల్ గుప్తా (అల్వార్): 489 స్కోర్ (81.5% మార్కులు)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


