ఈ రోజే CA final result- టైమ్​, డైరక్ట్​ లింక్​ వివరాలు..

ICAI CA September Result 2025 ఈ రోజు వెలువడనున్నాయి. డైరక్ట్​ లింక్​, టైమింగ్స్​తో పాటు ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 3, 2025, 09:10:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇన్​స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), తమ సీఏ సెప్టెంబర్ 2025 పరీక్ష ఫలితాలను సోమవారం, నవంబర్ 3 2025 నాడు విడుదల చేయనుంది. ఫలితాలు విడుదలైన వెంటనే ఫైనల్, ఇంటర్మీడియట్, ఫౌండేషన్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ icai.nic.in లో వాటిని చెక్​ చేసుకోవచ్చు.

ఈరోజే సీఏ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..
ఈరోజే సీఏ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

ఐసీఏఐ సీఏ సెప్టెంబర్ 2025 ఫలితాలు చెక్ చేసుకునే విధానం..

అభ్యర్థులు ఈ కింది సులభమైన దశలను అనుసరించి తమ ఫలితాలను తెలుసుకోవచ్చు:

స్టెప్​ 1- అధికారిక వెబ్‌సైట్ icai.nic.in ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో, 'సీఏ సెప్టెంబర్ 2025 ఫలితాలు' తనిఖీ చేసే లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- లాగిన్ అవ్వడానికి మీ క్రిడెన్షియల్స్​ని నమోదు చేసి, సబ్మిట్​ చేయండి.

స్టెప్​ 4- స్క్రీన్​పై వచ్చిన ఫలితాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి.

స్టెప్​ 5- ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్​ 6- భవిష్యత్తు అవసరాల కోసం దాని ప్రింటవుట్ కాపీని తప్పనిసరిగా భద్రపరుచుకోండి.

సీఏ ఫలితాలు- టైమింగ్స్​..

ఐసీఏఐ నోటీసు ప్రకారం.. ఫలితాలు ఈ కింది సమయాల్లో విడుదల కానున్నాయి:

ఫైనల్- ఇంటర్మీడియట్: సుమారుగా మధ్యాహ్నం 2:00 గంటలకు

ఫౌండేషన్: సుమారుగా సాయంత్రం 5:00 గంటలకు

సీఏ ఫలితాల కోసం అవసరమైన క్రిడెన్షియల్స్​..

అభ్యర్థులు తమ ఫలితాలను యాక్సెస్ చేయడానికి ఈ కింది వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది:

  • రిజిస్ట్రేషన్ నంబర్
  • రోల్ నంబర్

ఐసీఏఐ సీఏ సెప్టెంబర్​ 2025 ఫలితాల డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

పరీక్షల నిర్వహణ తేదీలు:

గతంలో నిర్వహించిన తేదీలు ఇక్కడ ఉన్నాయి:

ఫైనల్ కోర్సు పరీక్షలు: గ్రూప్ 1 పరీక్షలు సెప్టెంబర్ 3, 6, 8 2025 తేదీల్లో, గ్రూప్ 2 పరీక్షలు సెప్టెంబర్ 10, 12, 14, 2025 తేదీల్లో జరిగాయి.

ఇంటర్మీడియట్ కోర్సు పరీక్షలు: గ్రూప్ 1 పరీక్షలు సెప్టెంబర్ 4, 7, 9, 2025 తేదీల్లో, గ్రూప్ 2 పరీక్షలు సెప్టెంబర్ 11, 13, 15, 2025 తేదీల్లో జరిగాయి.

ఫౌండేషన్ కోర్సు పరీక్ష: ఈ పరీక్ష సెప్టెంబర్ 16, 18, 20, 22 2025 తేదీలలో జరిగింది.

మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా సూచించడమైనది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More