SBI Clerk Prelims ఫలితాల్ని ఇలా చెక్​ చేసుకోండి..

ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2025 త్వరలో విడుదలకానున్నాయి! ఫలితాల్ని ఎలా చెక్​ చేసుకోవాలి? ప్రిలిమ్స్​లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, తదుపరి ప్రక్రియ ఏంటి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 1, 2025, 05:32:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2025 క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. ఫలితాలు విడుదలైన వెంటనే, బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in లో వాటిని చూసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2025,,
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2025,,

ఎస్బీఐ క్లర్క్​ ప్రిలిమ్స్​లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు వెళతారు. ఆ తర్వాత వారికి ‘భాషా ప్రావీణ్యత పరీక్ష’ నిర్వహిస్తారు. అయితే, అభ్యర్థులు గమనించాల్సిన ముఖ్య విషయం.. తుది ఎంపిక కోసం మెరిట్ జాబితాను కేవలం మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే తయారు చేస్తారు!

ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితం 2025: ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

అభ్యర్థులు తమ ప్రిలిమ్స్ ఫలితాన్ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్​ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

స్టెప్​ 1- ముందుగా, ఎస్బీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్‌పేజీలో ఉన్న “కెరీర్స్” విభాగానికి వెళ్లండి.

స్టెప్​ 3- అక్కడ, “జూనియర్ అసోసియేట్”, "2025-26" సంవత్సర ఎంపికను ఎంచుకోండి.

స్టెప్​ 4- ప్రిలిమ్స్ ఫలితానికి సంబంధించిన లింక్ కనబడుతుంది. ఆ లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 5- తర్వాత వచ్చే లాగిన్ పేజీలో మీ రోల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.

స్టెప్​ 6- “సబ్మిట్”పై క్లిక్ చేయగానే మీ ప్రిలిమ్స్ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టెప్​ 7- ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం దాన్ని సేవ్ చేసి ఉంచుకోండి లేదా ప్రింట్ తీసుకోండి.

ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాల తేదీ..

ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశం ఉంది! కాబట్టి, తాజా సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండాలని సూచించారు.

ఎస్బీఐ జూనియర్ అసోసియేట్: ఖాళీల వివరాలు..

రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 6,589 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను వివిధ కేటగిరీల వారీగా ఈ విధంగా విభజించారు:

జనరల్ కేటగిరీ: 2,225 పోస్టులు

ఎస్సీ: 788 పోస్టులు

ఎస్టీ: 450 పోస్టులు

ఓబీసీ: 1,179 పోస్టులు

ఈడబ్ల్యూఎస్​: 508 పోస్టులు

పరీక్ష వివరాలు..

ప్రిలిమ్స్ పరీక్ష: ఇది ఆన్‌లైన్‌లో 100 మార్కులకు నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్ష: ఇది 200 మార్కులకు, 2 గంటల 40 నిమిషాల వ్యవధిలో జరుగుతుంది.

భాషా ప్రావీణ్యత పరీక్ష (ఎల్పీటీ): మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు, వారు దరఖాస్తు చేసుకున్న ప్రాంతీయ/స్థానిక భాషలో వారికి ఉన్న ప్రావీణ్యాన్ని అంచనా వేయడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More