దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ లొంబార్డ్ (ICICI Lombard) ప్రతిష్ఠాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను దక్కించుకుంది. సంస్థ 25వ రజతోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని 2026 ఆగస్టు 10న న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో కేవలం 12 గంటల్లో 25,468 హెల్మెట్లను పంపిణీ చేసి ఈ అరుదైన ఘనతను నమోదు చేసింది.

న్యూఢిల్లీలోని 13 పాఠశాలలతో సహా మొత్తం 14 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఏకకాలంలో చేపట్టారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ హెల్మెట్లను అందజేశారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ రహదారి భద్రతా అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐసీఐసీఐ లొంబార్డ్ సీనియర్ అధికారులు, ప్రభుత్వ, పోలీసు శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
'రైడ్ టు సేఫ్టీ'తో దశాబ్ద కాలపు ప్రయాణం
ఐసీఐసీఐ లొంబార్డ్ తమ సామాజిక బాధ్యత (CSR) చొరవ ‘రైడ్ టు సేఫ్టీ’ ద్వారా గత పదేళ్లుగా రహదారి భద్రతపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ద్విచక్ర వాహనదారులు, వెనుక కూర్చునే వారు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించేలా ప్రజల్లో చైతన్యం తెస్తోంది. 2015 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7 లక్షలకు పైగా హెల్మెట్లను పంపిణీ చేసి, సుమారు 25 లక్షల మంది జీవితాల్లో సురక్షిత ప్రయాణ వెలుగులు నింపినట్లు సంస్థ తెలిపింది.
సురక్షిత ప్రయాణమే ధ్యేయం
కేవలం హెల్మెట్ల పంపిణీకే పరిమితం కాకుండా, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో 'జీరో-ఫాటాలిటీ' (ప్రమాద రహిత) పరిష్కారాలను అమలు చేయడానికి స్థానిక ట్రాఫిక్ పోలీసులతో కలిసి కంపెనీ పనిచేస్తోంది. మరోవైపు, రోడ్డు ప్రమాద బాధితుల పునరావాసం కోసం నోయిడా, పాట్నాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన నిరంతర సహాయ సహకారాలు అందిస్తోంది.
"రికార్డులకు అతీతంగా మార్పు రావాలి"
ఈ విజయంపై ఐసీఐసీఐ లొంబార్డ్ మార్కెటింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ అండ్ సీఎస్ఆర్ హెడ్ షీనా కపూర్ స్పందిస్తూ, “సంస్థ 25 ఏళ్ల ప్రస్థానంలో గిన్నిస్ రికార్డు సాధించడం ఎంతో గర్వకారణం. 12 గంటల్లో 25,000 పైగా హెల్మెట్లు అందజేయడం మా సమష్టి కృషికి నిదర్శనం. అయితే మా లక్ష్యం కేవలం ఒక రికార్డుకే పరిమితం కాదు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపేలా ప్రోత్సహించి, భారత రహదారులపై ప్రమాద మరణాలను తగ్గించడమే మా అంతిమ ధ్యేయం” అని పేర్కొన్నారు.
{{/usCountry}}ఈ విజయంపై ఐసీఐసీఐ లొంబార్డ్ మార్కెటింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ అండ్ సీఎస్ఆర్ హెడ్ షీనా కపూర్ స్పందిస్తూ, “సంస్థ 25 ఏళ్ల ప్రస్థానంలో గిన్నిస్ రికార్డు సాధించడం ఎంతో గర్వకారణం. 12 గంటల్లో 25,000 పైగా హెల్మెట్లు అందజేయడం మా సమష్టి కృషికి నిదర్శనం. అయితే మా లక్ష్యం కేవలం ఒక రికార్డుకే పరిమితం కాదు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపేలా ప్రోత్సహించి, భారత రహదారులపై ప్రమాద మరణాలను తగ్గించడమే మా అంతిమ ధ్యేయం” అని పేర్కొన్నారు.
{{/usCountry}}