బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఐడీబీఐ బ్యాంక్ గొప్ప అవకాశం కల్పిస్తోంది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం) పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవలే సంక్షిప్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఐడీబీఐ బ్యాంక్ జేఏఎం రిక్రూట్‌మెంట్ 2026 ముఖ్యాంశాలు:
నియామక సంస్థ: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్)
పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం)
మొత్తం ఖాళీలు: 1100
విద్యార్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
వయోపరిమితి: 20 నుంచి 25 ఏళ్లు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 8, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 19, 2026
అధికారిక వెబ్‌సైట్: https://www.idbi.bank.in
ఐడీబీఐ బ్యాంక్ జేఏఎం రిక్రూట్‌మెంట్ 2026- అర్హత ప్రమాణాలు..
అభ్యర్థులు భారత ప్రభుత్వం, యూజీసీ లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదేని విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్య గమనిక: కేవలం డిప్లొమా కోర్సులు మాత్రమే చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అనర్హులు.
కింది పేర్కొన్న విభాగాల్లో నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్స్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులే:
బీ.ఎస్సీ
అగ్రికల్చర్ / అగ్రికల్చర్ ఇంజనీరింగ్ (బీ.టెక్ / బీ.ఈ)
హార్టికల్చర్ (ఉద్యానవన శాస్త్రం)
ఫిషరీ సైన్స్ / ఇంజనీరింగ్
యానిమల్ హస్బెండరీ (పశుసంవర్ధక శాఖ)
{{/usCountry}}యానిమల్ హస్బెండరీ (పశుసంవర్ధక శాఖ)
{{/usCountry}}వెటర్నరీ సైన్స్
ఫారెస్ట్రీ (అటవీ శాస్త్రం)
డెయిరీ సైన్స్ / టెక్నాలజీ
ఫుడ్ సైన్స్ / టెక్నికల్
పిసికల్చర్ (చేపల పెంపకం)
ఆగ్రో ఫారెస్ట్రీ
సెరికల్చర్ (పట్టు పురుగుల పెంపకం)
వయోపరిమితి:
కనీస వయస్సు: 20 ఏళ్లు
గరిష్ట వయస్సు: 25 ఏళ్లు
నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
ఐడీబీఐ బ్యాంక్ జేఏఎం రిక్రూట్‌మెంట్ 2026- ఎంపిక ప్రక్రియ..
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అభ్యర్థులను కింది నాలుగు దశల ద్వారా ఎంపిక చేస్తారు:
ఆన్‌లైన్ పరీక్ష
ధృవీకరణ పత్రాల పరిశీలన
వ్యక్తిగత ఇంటర్వ్యూ
ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్
ప్రతి దశలోనూ అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు.
ఐడీబీఐ బ్యాంక్ జేఏఎం రిక్రూట్‌మెంట్ 2026- ఫీజు వివరాలు..
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ- రూ. 250
ఇతర అభ్యర్థులకు- రూ. 1050
చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు గడువు ముగియకముందే దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ సూచించింది.
ఐడీబీఐ బ్యాంక్ జేఏఎం రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐడీబీఐ బ్యాంక్ జేఏఎం రిక్రూట్‌మెంట్ 2026 అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.