'కింగ్ కోహ్లీ' ఈజ్ బ్యాక్! ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్- ఆ రికార్డు కూడా బ్రేక్..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. రోహిత్ శర్మను అధిగమించి, బ్యాటింగ్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లాడు కోహ్లీ. అంతేకాదు, న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగుల సాధించిన బ్యాటర్‌గానూ చరిత్ర సృష్టించాడు.
క్రికెట్ ప్రపంచంలో తనని 'కింగ్' అని ఎందుకు అంటారో విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించాడు! తన అద్భుతమైన ఫామ్‌తో ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. జులై 2021 తర్వాత కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి. వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 91 బంతుల్లో 93 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ, తన సహచర ఆటగాడు రోహిత్ శర్మను వెనక్కి నెట్టి ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్.1 స్థానాన్ని అధిగమించాడు.

కెరీర్‌లో 11వ సారి..
విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకోవడం ఇది 11వ సారి.
కింగ్ కోహ్లీ మొట్టమొదటిసారిగా అక్టోబర్ 2013లో వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. మొత్తం మీద 825 రోజుల పాటు కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగాడు. భారత్ తరఫున అత్యధిక కాలం నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న రికార్డు కోహ్లీ పేరిటే ఉంది.
అయితే, కోహ్లీకి ఈ స్థానాన్ని కాపాడుకోవడం అంత సులువేం కాదు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ తేడాతో కోహ్లీ వెంటే ఉన్నాడు. తొలి వన్డేలో మిచెల్ చేసిన 84 పరుగులు అతడిని రెండో స్థానానికి చేర్చాయి.
ప్రస్తుతం రోహిత్ శర్మ మూడో స్థానానికి పడిపోయారు.
కోహ్లీ మరో రికార్డు..
రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ మరో రికార్డు బ్రేక్ చేశాడు. వన్డేల్లో టీమిండియా తరఫున న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ న్యూజిలాండ్ మీద 1750 రన్స్ చేశాడు. రెండో వన్డేలో కోహ్లీ 7 పరుగులు వద్ద ఉన్నప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల లిస్ట్‌లో కోహ్లీ ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నాడు. 1971 రన్స్‌తో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాయింటింగ్ మొదటి ప్లేస్‌లో ఉన్నాడు.
గేర్ మార్చిన కోహ్లీ..
ఇటీవలి కాలంలో కోహ్లీ బ్యాటింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది!
గత అక్టోబర్‌లో ఆస్ట్రేలియాపై వరుసగా రెండుసార్లు సున్నా పరుగులకే ఔటైనప్పుడు విరాట్ కోహ్లీపై విమర్శలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత రన్ మెషిన్ గేర్ మార్చాడు! సిడ్నీ వన్డేలో 74 పరుగులతో ఫామ్‌లోకి వచ్చిన విరాట్, ఇక వెనక్కి తిరిగి చూడలేదు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో 135, 102, 65 (నాటౌట్) రన్స్ చేసి పరుగుల వరద పారించారు.
ఇక న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో జెస్ట్‌లో సెంచరీ మిస్ చేసుకున్నాడు కోహ్లీ. 93 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ మొత్తం దూకుడుగా ఆడుతూ అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్- రెండో వన్డే..
రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగింది టీమిండియా. ప్రస్తుతం 17 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు సాధించింది. కోహ్లీ (14), శ్రేయస్ అయ్యార్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
రోహిత్ శర్మ 24 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ హాఫ్ సెంచరీ చేసి (56) వెనుదిరిగాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


