అనుకున్నదే జరిగింది! భారత్ చేతిలో పాకిస్థాన్ జట్టు మరోసారి ఓడిపోయింది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్స్‌లో గెలిచిన శ్రేయస్ అయ్యర్ సేన.. భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. కొన్ని రోజుల క్రితం జరిగిన మహిళల క్రికెట్ ఫైనల్స్‌లో శ్రీలంకపై గెలిచి మన భారత ఉమెన్స్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.

నిషిన్‌లో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 211 పరుగులు భారీ లక్ష్యాన్ని పాక్ ముంగిట ఉంచింది. బదులుగా ఫర్హాన్ సేన మాత్రమే 192 రన్సే చేయగలిగింది.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ టీ20 మ్యాచ్ జరిగింది ఇలా..
భారత్- పాక్ మ్యాచ్ మధ్య పోరు కోసం క్రికెట్ అభిమానులు ఒకప్పుడు చాలా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూసే వారు. ఇటీవలి కాలంలో మాత్రం వార్ వన్ సైడ్ అయిపోయింది! పాకిస్థాన్ ఓడిపోవడం, టీమిండియా సునాయాసంగా గెలుస్తుండటం ఆనవాయతీగా వస్తోంది. మరీ ముఖ్యంగా టీ20ల్లో పాక్‌పై ఇండియాదే పైచేయి. ఈసారి కూడా అదే జరిగింది.
ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లలో భారత్ 15-3 తేడాతో (నేటి మ్యాచ్‌తో కలిపి) అత్యంత బలమైన ఆధిక్యంలో కొనసాగుతోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మొదటిలోనే దెబ్బ తగిలింది! యంగ్ గన్ సూర్యవంశీ 15 పరుగులే చేసి వెనుదిరిగాడు. కానీ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం చెలరేగి ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లపై రెచ్చిపోతూ 28 పరుగుల్లోనే 61 రన్స్ చేశాడు. ఈసారి సెంచరీ ఖాయం అనుకున్న సమయంలో స్టంప్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ సామ్సన్ (2), శ్రేయస్ అయ్యర్ (21), ఇషాన్ కిషన్ (20) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.
కానీ తిలక్ వర్మ రూపంలో పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బతగిలింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. తిలక్ వర్మ ఏకాగ్రత కోల్పోకుండా ఆడాడు. 22 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శివమ్ దూబె (27) సాయంతో జట్టు స్కోరును 200 దాటించాడు.
{{/usCountry}}కానీ తిలక్ వర్మ రూపంలో పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బతగిలింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. తిలక్ వర్మ ఏకాగ్రత కోల్పోకుండా ఆడాడు. 22 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శివమ్ దూబె (27) సాయంతో జట్టు స్కోరును 200 దాటించాడు.
{{/usCountry}}పాకిస్థాన్ బౌలర్లలో అహ్మద్ దనియాల్ 2 వికెట్లు, అరాఫట్ మిన్హాస్ 2 వికెట్లు తీశారు. సైమ్ ఆయుబ్, అబ్రార్ అహ్మద్‌లు చెరో వికెట్ సొంతం చేసుకున్నారు.
ఇక 212 పరుగుల భారీ భారీ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన పాకిస్థాన్ 6.1 ఓవర్లలోపే 3 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన హసన్ నవాజ్.. జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 47 బంతుల్లో 88 పరుగులు చేసి పాక్ శిబిరంలో ఆశలు నింపాడు. కానీ మరో ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోవడంతో హసన్ ప్రయత్నం విఫలమైంది. చివరికి పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 192 పరుగులే చేయగలిగింది. టీమిండియా 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీమిండియా బౌలర్లు వాషింగ్టన్ సుందర్ 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. దూబే 2 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా మాత్రం 4 ఓవర్లకు 33 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు.
క్రికెట్లో తాజా విజయంతో ఆసియా గేమ్స్ 2026లో భారత్‌కు 19 గోల్డ్ మెడల్ లభించింది.