...
...
Next Story

Ind vs Afg: టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా బిగ్గెస్ట్ విన్ రికార్డ్.. అరంగేట్రంతోనే అదరగొట్టిన మానవ్ సుతార్

Ind vs Afg: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే టీమిండియా అతిపెద్ద విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో ఆ టీమ్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. తొలి మ్యాచ్ లోనే స్పిన్నర్ మానవ్ సుతార్ రికార్డు క్రియేట్ చేశాడు.

Published on: Jun 8, 2026, 16:14:42 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ind vs Afg: చండీగఢ్ కొత్త స్టేడియం వేదికగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో (India vs Afghanistan Test match) టీమిండియా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌ను ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తన అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

Ind vs Afg: టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా బిగ్గెస్ట్ విన్ రికార్డ్.. అరంగేట్రంతోనే అదరగొట్టిన మానవ్ సుతార్
Ind vs Afg: టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా బిగ్గెస్ట్ విన్ రికార్డ్.. అరంగేట్రంతోనే అదరగొట్టిన మానవ్ సుతార్

కేవలం మూడే రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇండియన్ బౌలర్లు, బ్యాటర్లు వన్ సైడ్ షో చూపించారు. అరంగేట్రం చేసిన యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (Manav Suthar) ఆరు వికెట్లతో చెలరేగితే, సెకండ్ ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తమ స్పిన్ మాయతో అఫ్గాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.

ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటింగ్ ఎందుకు ఫెయిల్ అయింది?

తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా 564/8 స్కోరు వద్ద భారీ స్థాయిలొ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌.. ఇండియన్ స్పిన్ ట్రాక్స్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా తేలిపోయింది. రెడ్-బాల్ క్రికెట్‌లో వారికి ఉన్న తక్కువ అనుభవం, ముఖ్యంగా టర్నింగ్ పిచ్‌లపై స్పిన్‌ను ఎలా ఆడాలో తెలియకపోవడం వల్లే వాళ్ల లైనప్ కుప్పకూలింది. రెండో రోజు ముగిసేసరికే 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు.

మూడో రోజు ఎంట్రీ ఇచ్చిన యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ ఆఫ్ఘనిస్తాన్‌ టీమ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. రహ్మత్ షా (60) కాస్త పోరాడినా మిగతా వాళ్ల నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. సుతార్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి తన డెబ్యూ మ్యాచ్‌లోనే 5 వికెట్ల మార్క్ అందుకున్నాడు. కేవలం 33 రన్స్ ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 1988లో నరేంద్ర హిర్వాణీ వెస్టిండీస్‌పై క్రియేట్ చేసిన రికార్డ్ తర్వాత, ఒక డెబ్యూ బౌలర్ ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం మళ్లీ ఇప్పుడే చూస్తున్నాం. దీంతో ఆఫ్ఘన్ ఫస్ట్ ఇన్నింగ్స్ 152 రన్స్‌కే ప్యాకప్ అయింది.

ఫాలో ఆన్‌లోనూ స్పిన్ మాయే!

కానీ ఆ తర్వాత ఇండియన్ బౌలర్లు రెచ్చిపోవడంతో కేవలం 38 రన్స్ గ్యాప్‌లోనే మిగిలిన 9 వికెట్లు పడిపోయాయి. మొత్తంగా 112 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్‌ ఆలౌట్ అయింది. మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు తీసి రికార్డ్ సెట్ చేసిన మానవ్ సుతార్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

ఆ లెంగ్త్ మార్చుకోవడమే వర్కౌట్ అయింది: వాషింగ్టన్ సుందర్

మ్యాచ్ తర్వాత వాషింగ్టన్ సుందర్ మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత టెస్ట్ ఫార్మాట్ ఆడటం హ్యాపీగా ఉంది. ఫస్ట్ బాల్ నుంచే నాకు మంచి రిథమ్ దొరికింది. పిచ్ బౌలర్లకు బాగా సపోర్ట్ చేసింది. అయితే కొంచెం షార్ట్ లెంగ్త్ బాల్స్ వేస్తే బ్యాటర్లకు ఆడేందుకు టైమ్ దొరుకుతుంది కదా, అందుకే వెంటనే ఆ లెంగ్త్ సరిచేసుకుని బౌలింగ్ చేశాను. అదే మాకు వర్కౌట్ అయింది" అని చెప్పుకొచ్చాడు.

ఈ చారిత్రాత్మక విజయం తర్వాత టీమిండియా తదుపరి వన్డే సిరీస్‌కు రెడీ అవుతోంది. జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా ఇండియా, అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ స్టార్ట్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe