IND vs ENG : కోహ్లీ ఈజ్ బ్యాక్- రోహిత్, బుమ్రా కూడా! ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ అయినా గెలిచేనా?
India vs England odi series 2026 : ఇంగ్లాండ్‌తో ఇండియా ఆడనున్న 3 మ్యాచుల వన్డే సిరీస్‌ని నేడు ప్రారంభంకానుంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఆట మొదలవుతుంది. విరాట్ కోహ్లీ, బుమ్రా, రోహిత్ శర్మలు జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఐర్లాండ్ చేతిలో ఘోర భంగపాటు, ఇంగ్లాండ్ చేతిలో పరాజయం అనంతరం టీమిండియా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కొన్ని రోజుల క్రితం టీ20 సిరీస్‌లో ఓటమి అనంతరం టీమిండియా.. శుభ్‌మాన్ గిల్ సారథ్యంలో, ఇంగ్లాండ్‌తో నేడు తన వన్డే సిరీస్‌ని ప్రారంభించనుంది. లెజెండ్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు చేరడంతో పేపర్ మీద మన జట్టు బలంగా ఉంది. మరీ ముఖ్యంగా అందరి చూపు ఇప్పుడు బుమ్రాపై ఉండనుంది. 2023 వరల్డ్ కప్ అనంతరం అతను ఆడుతున్న తొలి వన్డే మ్యాచ్ ఇదే! ఇక ఇటీవలి కాలంలో టెస్టులు, టీ20ల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఈ వన్డే సిరీస్ విజయం అత్యంత కీలకంగా మారింది. ఎలాగైనా ఆధిపత్యం చాటి విమర్శకులకు సమాధానం చెప్పాలని గంభీర్ వ్యూహాలు రచిస్తున్నాడు.

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొదటి వన్డే మ్యాచ్- ఎప్పుడు? ఎక్కడ?
3 మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఈ తొలి వన్డే మ్యాచ్ మంగళవారం బర్మింగ్‌హామ్‌లోని ప్రసిద్ధ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరగనుంది.
మ్యాచ్ మన భారత కాలమానం ప్రకారం జులై 14, మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకంటే అరగంట ముందు, అంటే మధ్యాహ్నం 3:00 గంటలకు టాస్ వేస్తారు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొదటి వన్డే మ్యాచ్- పిచ్ రిపోర్టు..
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొదటి వన్డే మ్యాచ్‌కు వరుణుడి ముప్పు లేదు. ఈ గ్రౌండ్లో చివరిసారిగా మే 2025లో జరిగిన వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ 400 రన్స్ చేసింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొదటి వన్డే మ్యాచ్- లైవ్ టెలికాస్ట్..
ఈ మ్యాచ్‌ను భారతీయ క్రీడాభిమానులు టీవీల్లో, మొబైల్స్‌లో వీక్షించేందుకు విస్తృత ఏర్పాట్లు జరిగాయి.
టీవీ ఛానెల్: భారతదేశంలో ఈ సిరీస్ అధికారిక బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. సోనీ ఛానెళ్లలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
లైవ్ స్ట్రీమింగ్: ఇంటర్నెట్ లేదా మొబైల్‌లో మ్యాచ్ చూడాలనుకునే వారు 'జియోహాట్‌స్టార్' యాప్ లేదా వెబ్‌సైట్‌లో సబ్‌స్క్రిప్షన్ ద్వారా లైవ్ మ్యాచ్‌ను వీక్షించవచ్చు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్- ఇరు జట్ల ఆటగాళ్ల వివరాలు..
భారత జట్టు:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, శివమ్ దూబే, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లాండ్ జట్టు:
బెన్ డకెట్, విల్ జాక్స్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, సామ్ కరన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, టామ్ బాంటన్, జోష్ టంగ్, గస్ అట్కిన్సన్, జేమ్స్ కోల్స్, రెహాన్ అహ్మద్.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


