టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాక్- ఇండియాకు గుడ్ న్యూస్- డేంజరస్ బ్యాటర్ వచ్చేశాడు- మనదే బ్యాటింగ్- నో షేక్ హ్యాండ్

క్రికెట్ ప్రపంచం ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేసిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ పోరుకు టైమ్ వచ్చేసింది. ఆదివారం కొలంబో స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. రెండు రోజుల నుంచి కంగారు పెట్టిన వర్షం మ్యాచ్ సమయానికి తగ్గిపోయింది. 

Published on: Feb 15, 2026, 18:34:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్లాక్ బస్టర్ పోరుకు రంగం సిద్ధమైంది. హై వోల్టేజీ సమరానికి టైమ్ ఆసన్నమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఈ రోజే. ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్

నో షేక్ హ్యాండ్

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో అందరూ అనుకున్నట్లుగానే ఆటగాళ్ల మధ్య షేక్ హ్యాండ్ లేదు. పాకిస్థాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేసేందుకు ఇండియన్ ప్లేయర్లు నిరాకరించారు. టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీన్ని బట్టి మరోసారి ఇండియా, బీసీసీఐ తన వైఖరిని బలంగా చాటింది.

ఆ డ్రామా తర్వాత

నిజానికి టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగడంపై మొదట అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇండియాతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఐసీసీ వార్నింగ్ తో పాక్ తోక ముడిచింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు దిగి వచ్చింది. అయితే ఇండియాతో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మూడు కండీషన్లు పెట్టిందనే వార్తలు వచ్చాయి. వీటిని ఐసీసీ పట్టించుకోలేదని తెలిసింది.

డిఫెండింగ్ ఛాంపియన్

టీ20 ప్రపంచకప్ లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగింది. 2024 టీ20 ప్రపంచకప్ కు భారత్ గెలిచింది. ఇప్పుడు 2026 టీ20 ప్రపంచకప్ లోనూ టైటిల్ లక్ష్యంగా అడుగుపెట్టింది. గ్రూప్-ఎలో ఇప్పటికే అమెరికా, నమీబియాను ఇండియా చిత్తు చేసింది. ఇప్పుడు పాకిస్థాన్ పై విక్టరీతో సూపర్ 8లో ప్లేస్ కన్ఫామ్ చేసుకోవడమే భారత టీమ్ టార్గెట్.

అభిషేక్ శర్మ

పాకిస్థాన్ తో పోరులో అందరి ఫోకస్ ప్రధానంగా ఇండియన్ డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మపైనే ఉంది. కడుపు నొప్పితో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న అభిషేక్.. నమీబియాతో మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇప్పుడు పాకిస్థాన్ తో పోరుకు తిరిగివచ్చిన అతను ఓపెనింగ్ ఓవర్లలోనే చెలరేగాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక అర్ష్ దీప్ స్థానంలో స్పిన్నర్ కుల్ దీప్ ఫైనల్ ఎలెవన్ లోకి వచ్చాడు.

మరోవైపు పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారీఖ్ ను ఇండియన్ బ్యాటర్లు జాగ్రత్తగా ఫేస్ చేయాలని మాజీలు చెప్తున్నారు. సూర్యకుమార్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. మరి ఈ స్పిన్నర్ ను మన ఇండియన్ బ్యాటర్లు ఎలా ఆడతారో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More