రూ. 40వేల వరకు జీతంతో ఇండియన్​ నేవీలో అగ్నివీర్​ పోస్టులు- సమీపిస్తున్న రిజిస్ట్రేషన్​ గడువు..

Indian Navy Agniveer Recruitment 2026 : ఇండియన్​ నేవీ అగ్నివీర్​ రిక్రూట్​మెంట్​పై బిగ్​ అప్డేట్​! ఇంకొన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ముగియనుంది. పోస్టులు, దరఖాస్తు ప్రక్రియ, జీతం వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Apr 3, 2026, 08:15:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత నౌకాదళంలో చేరి దేశ రక్షణలో తమ వంతు పాత్ర పోషించాలని భావిస్తున్న యువతకు ముఖ్యమైన అలర్ట్​! ఇండియన్​ నేవీలో అగ్నివీర్ పథకం కింద అగ్నివీర్ ఎస్​ఎస్​ఆర్​, ఎంఆర్​, మెడికల్ సెయిలర్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు చేపట్టిన రిక్రూట్​మెంట్​ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్​మెంట్​కి సంబంధించిన కీలక వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండియన్​ నేవీ అగ్నివీర్​ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్..
ఇండియన్​ నేవీ అగ్నివీర్​ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్..

ఇండియన్​ నేవీ అగ్నివీర్​ రిక్రూట్​మెంట్​ 2026 వివరాలు..

రిజిస్ట్రేషన్​ ప్రారంభం: మార్చ్​ 14, 2026

రిజిస్ట్రేషన్​కి చివరి తేదీ: ఏప్రిల్ 6, 2026

కరెక్షన్​ విండో : ఏప్రిల్ 10, 11 తేదీల్లో అవకాశం ఉంటుంది.

పరీక్ష తేదీ : మే 2026 (తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.)

ఫలితాల విడుదల: జూన్ 2026

ఇండియన్​ నేవీ అగ్నివీర్​ రిక్రూట్​మెంట్​ 2026- పోస్టుల వారీగా ఎలిజిబులిటీ..

ఇండియన్​ నేవీ అగ్నివీర్​ రిక్రూట్​మెంట్​లో భాగంగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

అగ్నివీర్ ఎస్​ఎస్​ఆర్​ (మెడికల్): ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (పీసీబీ) సబ్జెక్టుల్లో చదువుకుని ఉండాలి.

అగ్నివీర్ ఎంఆర్​ : 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అగ్నివీర్ ఎస్​ఎస్​ఆర్​ : ఇంటర్మీడియట్ (12వ తరగతి)లో గణితం, భౌతికశాస్త్రం ఎంచుకుని ఉండాలి. లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

గమనిక: వయోపరిమితి ఒక్కో పోస్టుకు భిన్నంగా ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది.

ఇండియన్​ నేవీ అగ్నివీర్​ రిక్రూట్​మెంట్​ 2026- సెలక్షన్​ ప్రాసెస్​..

నౌకాదళంలో ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకమైన, కఠినమైన దశల్లో జరుగుతుంది.

లెవల్-1 (ఐఎన్​ఈటీ): కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష

షార్ట్‌లిస్టింగ్: రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారిని మాత్రమే నెక్ట్స్​ లెవల్​కి ఎంపిక చేస్తారు.

లెవల్​-2 (పీఎఫ్​టీ): శారీరక సామర్థ్య పరీక్షలు. ఇందులో రన్నింగ్​, స్క్వాట్స్, పుష్-అప్స్, సిట్-అప్స్ వంటివి ఉంటాయి.

లెవల్​ 3- రాత పరీక్ష అండ్​ వైద్య పరీక్ష: ఫిజికల్ టెస్ట్ అనంతరం మరో రాత పరీక్ష, సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

వీటిని దాటుకుని ఎంపికైన వారికి తుది మెరిట్ జాబితాలో నిలిచిన వారికి ఐఎన్​ఎస్​ చిల్కాలో శిక్షణ ఇస్తారు.

ఇండియన్​ నేవీ అగ్నివీర్​ రిక్రూట్​మెంట్​ 2026- ఎలా రిజిస్టర్​ చేసుకోవాలి?

స్టెప్​ 1- ఇండియన్​ నేవీ అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.

స్టెప్​ 2- అప్లై ఆన్​లైన్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 3- మొబైల్​ నెంబర్​తో రిజిస్టర్​ చేసుకోండి

స్టెప్​ 4- అప్లికేషన్​ ఫామ్​ ఫిల్​ చేయండి.

స్టెప్​ 5- అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి.

స్టెప్​ 6- అప్లికేషన్​ ఫీజును చెల్లించండి

స్టెప్​ 7- సబ్మిట్​ బటన్​పై క్లిక్​ చేయండి. కన్ఫర్మేషన్​ పేజీని డౌన్​లోడ్​ చేసుకోండి.

పరీక్ష ఫీజు: రూ. 550 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

పురుషులు, మహిళా అభ్యర్థులు ఇద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇండియన్​ నేవీ అగ్నివీర్​ రిక్రూట్​మెంట్​ 2026- జీతాలు..

మొదటి ఏడాది : జీతం- రూ. 30వేలు, టేక్​ హోమ్​- రూ. 21వేలు

రెండో ఏడాది : జీతం- రూ. 33వేలు, టేక్​ హోమ్​- రూ. 33,100

మూడో ఏడాది : జీతం- రూ. 36,500, టేక్​ హోమ్​- రూ. 25,550

నాలుగో ఏడాది : జీతం- రూ. 40,000, టేక్​ హోమ్​- రూ. 28,000

చివరి నిమిషంలో హడావుడి పడకుండా ఉండేందుకు, ముందే రిజిస్ట్రేషన్​ చేసుకోవడం బెటర్​ అని నిపుణులు సూచిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More