దుబాయ్ ఎయిర్ షోలో అనుకోని ప్రమాదం జరిగింది. భారత్ కు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్‌షోలో విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా తేజస్ కూలిపోయి భూమిని తాకింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.
పైలెట్ మృతి…

ఈ ఘటనపై భారత వైమానిక విభాగం స్పందించింది. “ఈరోజు దుబాయ్ ఎయిర్ షోలో వైమానిక ప్రదర్శన సందర్భంగా IAF తేజస్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్ తీవ్రంగా గాయపడి.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై IAF తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. పైలెట్ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేస్తున్నాం” అని ప్రకటన విడుదల చేసింది.
వైమానిక ప్రదర్శనలో భాగంగా తేజస్ యుద్ధ విమానం గాల్లో పలుమార్లు విన్యాసాలు చేసింది. ఆ తర్వాత గాల్లో గింగిరాలు తిరిగి నేలను బలంగా ఢీకొట్టడంతో వెంటనే క్రాష్ అయింది. దీంతో ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన, నల్లటి పొగ కమ్ముకుంది.
తేజస్ యుద్ధ విమాన ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్, సంబంధిత అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
శుక్రవారంతో ఈ ఎయిర్ షో ముగియనుంది. వైమానిక ప్రదర్శనను చూడటానికి చాలా కుటుంబాలు తరలివచ్చాయి. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి.
{{/usCountry}}శుక్రవారంతో ఈ ఎయిర్ షో ముగియనుంది. వైమానిక ప్రదర్శనను చూడటానికి చాలా కుటుంబాలు తరలివచ్చాయి. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి.
{{/usCountry}}తేజస్ అనేది భారతదేశం యొక్క స్వదేశీ యుద్ధ విమానం. దీనిని ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇక ఎయిర్ షోలో తేజస్ విమానం… చమురు లీకేజీకి గురైందంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో కనిపింటాయి. వీటిని తప్పుడు పోస్టులుగా పేర్కొంటూ పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఓ ప్రకటన విడుదల చేసింది.
గతేడాది రాజస్థాన్ లో కూడా తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. కానీ ఆ సంఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.