ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) దేశవ్యాప్తంగా వివిధ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ iocl.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఐఓసీఎల్ ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 433 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 6, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. విద్యార్హతలు, వయస్సు పరిమితి, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- విద్యార్హత, వయస్సు వివరాలు..
ఐఓసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026కి సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు పదొవ తరగతి (మెట్రిక్) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ గుర్తించిన సంస్థ నుంచి రెండేళ్ల రెగ్యులర్ ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
అభ్యర్థుల వయస్సు ఆగస్టు 31, 2026 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు 3 ఏళ్లు (గరిష్టంగా 27 ఏళ్ల వరకు) సడలింపు వర్తిస్తుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోసడలింపు లభిస్తుంది.
ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
నాప్స్ లేదా నాట్స్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎంపిక కోసం పరిగణిస్తారు. ఈ నియామకానికి ఎలాంటి రాత పరీక్ష కానీ, ఇంటర్వ్యూ కానీ ఉండదు.
పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధిత విద్యార్హతలో వచ్చిన మార్కుల శాతాన్ని ఆధారంగా చేసుకుని మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు ఒకేలాంటి మార్కులు వస్తే, పుట్టిన తేదీ ప్రకారం ఎక్కువ వయస్సు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. పుట్టిన తేదీ కూడా ఒకేలా ఉంటే, పదొవ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చినవారిని ఎంపిక చేస్తారు.
ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- ధ్రువపత్రాల పరిశీలన..
{{/usCountry}}పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధిత విద్యార్హతలో వచ్చిన మార్కుల శాతాన్ని ఆధారంగా చేసుకుని మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు ఒకేలాంటి మార్కులు వస్తే, పుట్టిన తేదీ ప్రకారం ఎక్కువ వయస్సు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. పుట్టిన తేదీ కూడా ఒకేలా ఉంటే, పదొవ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చినవారిని ఎంపిక చేస్తారు.
ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్ 2026- ధ్రువపత్రాల పరిశీలన..
{{/usCountry}}మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అభ్యర్థులు పుట్టిన తేదీ ధృవీకరణ కోసం పదొవ తరగతి మార్కుల జాబితాను మాత్రమే సమర్పించాలి. అలాగే రిజర్వేషన్ వర్గానికి చెందినవారు నిబంధనల ప్రకారం జారీ చేసిన కుల ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఐఓసీఎల్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.