iQOO 16 : 50ఎంపీ ట్రిపుల్ కెమెరా, 8500ఎంఏహెచ్ బ్యాటరీతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్- రెండు రోజుల్లో లాంచ్..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ తన మోస్ట్ అవేటెడ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘ఐక్యూ 16’ లాంచ్ తేదీని అధికారికంగా ఖరారు చేసింది. 8500ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ గ్యాడ్జెట్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
మొబైల్ గేమింగ్ లవర్స్, పవర్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐక్యూ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'ఐక్యూ 16' లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను సెప్టెంబర్ 14న చైనాలో అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు కంపెనీ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ఐక్యూ 16తో పాటు అత్యంత శక్తివంతమైన 'ఐక్యూ ప్యాడ్ ఆల్ట్రా' టాబ్లెట్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తున్నారు.

మన దేశంలో ఐక్యూ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు ఉన్న గేమింగ్ క్రేజ్ అంతా ఇంతా కాదు! చైనాలో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ ఫోన్ భారత మార్కెట్లోకి కూడా ఈ ఐక్యూ 16 అడుగుపెట్టే అవకాశం ఉంది. రాబోయే పండుగల సీజన్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా నిలవనుంది.
ఈ నేపథ్యంలో ఈ ఐక్యూ 16 స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి.
ఐక్యూ 16- కన్సోల్ రేంజ్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్..
గేమింగ్ ప్రియులను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఐక్యూ ఈసారి సాంకేతికతను కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. గతంలో వచ్చిన ఐక్యూ 15లోని క్యూ3 గేమింగ్ చిప్ స్థానంలో, మరిన్ని ఆవిష్కరణలతో రూపొందించిన ఇన్-హౌస్ 'క్యూ4 గేమింగ్ చిప్'తో పాటు 'మాన్స్టర్ సూపర్ ఇంజిన్' టెక్నాలజీని ఐక్యూ 16లో పరిచయం చేస్తున్నారు.
ఈ ప్రత్యేక కాంబినేషన్ ద్వారా సోనీ ప్లేస్టేషన్ లేదా ఎక్స్‌బాక్స్ వంటి కన్సోల్ పరికరాల్లో లభించే ‘రే ట్రేసింగ్’ గ్రాఫిక్స్ అనుభూతి మొబైల్లోనూ సాధ్యమవుతుందని కంపెనీ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే రాబోతున్న వన్‌ప్లస్ 16 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు ఇది అత్యంత కఠినమైన పోటీని ఇవ్వనుంది.
ఐక్యూ 16- అద్భుతమైన 2K డిస్‌ప్లే..
లీక్ అయిన నివేదికల ప్రకారం.. ఐక్యూ 16 స్మార్ట్‌ఫోన్ 6.85 అంగుళాల సామ్‌సంగ్ ఎం16 ఓఎల్ఈడీ డిస్‌ప్లే ప్యానెల్‌తో రానుంది. ఇది 2కే+ రిజల్యూషన్, 144హెచ్‌జెడ్ లేదా 165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా శాంసంగ్ తదుపరి తరం 'LEAD' డిస్‌ప్లే సాంకేతికతను ఇందులో ఉపయోగిస్తున్నారు. దీనివల్ల గేమ్స్ ఆడుతున్నప్పుడే కాకుండా, 4కే మూవీస్ లేదా వీడియా స్ట్రీమింగ్ సమయంలో విజువల్స్ అత్యంత స్పష్టంగా, కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తాయి.
పర్ఫార్మెన్స్ విభాగంలో క్వాల్కమ్ సంస్థకు చెందిన అత్యంత వేగవంతమైన ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 6 ప్రో’ చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐక్యూ 16- మూడు 50ఎంపీ కెమెరాలు..!
సాధారణంగా గేమింగ్ ఫోన్లలో కెమెరా క్వాలిటీ తక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఐక్యూ 16 ఆ అంచనాలను తిరగరాస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫ్యూచరిస్టిక్ రీ-డిజైన్డ్ మాడ్యూల్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ లెన్స్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లను అమర్చారు.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీనే! ఇందులో ఏకంగా 8,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో ఎంతటి భారీ గేమింగ్ ఆడినా ఛార్జింగ్ అయిపోతుందనే భయం ఉండదు.
పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ లైఫ్ అన్నింటిలోనూ రాజీ పడకూడదనుకునే వారికి ఐక్యూ 16 సరైన ఎంపిక కానుంది.
సెప్టెంబర్ 14 లాంచ్ ఈవెంట్‌లో ఈ ఐక్యూ 16 పూర్తి ఫీచర్లు, ధర వివరాలు తెలుస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


