iQOO Z11 Lite : 6,500ఎంఏహెచ్ బ్యాటరీతో ఐక్యూ జెడ్11 లైట్ లాంచ్- ధర కూడా తక్కువే..
iQOO Z11 Lite : ఐక్యూ సంస్థ భారత్‌లో ఐక్యూ జెడ్11 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 6,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ లాంచ్ ఆఫర్లతో కలిపి రూ. 17,999 ప్రారంభ ధరకే లభిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ భారత మార్కెట్‌లోకి తమ తాజా బడ్జెట్ 5జీ మోడల్ 'ఐక్యూ జెడ్11 లైట్ 5జీ'ని అధికారికంగా ప్రవేశపెట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లేతో రూపుదిద్దుకున్న ఈ హ్యాండ్‌సెట్ వినియోగదారులకు బడ్జెట్ ధరలోనే మెరుగైన అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్ మూడు విభిన్న స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

ఐక్యూ జెడ్11 లైట్ 5జీ- ధర, బ్యాంక్ ఆఫర్లు..
ఐక్యూ జెడ్11 లైట్ 5జీ ప్రారంభ మోడల్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,499గా నిర్ణయించారు. అలాగే 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 21,499 కాగా, టాప్ ఎండ్ 6GB RAM + 256GB వేరియంట్ ధర రూ. 24,499గా ఉంది.
కొనుగోలుదారుల కోసం కంపెనీ ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే తక్షణమే రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ వర్తింపజేస్తే బేసిక్ మోడల్ రూ. 17,999, మిడ్ వేరియంట్ రూ. 19,999, టాప్ వేరియంట్ రూ. 22,999 లకే సొంతం చేసుకోవచ్చు. దీనికి తోడు 3 నెలల నో కాస్ట్ ఈఎంఐ వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు.
ఐక్యూ జెడ్11 లైట్ 5జీ- సేల్స్..
ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ జులై 30న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్నాయి. కొనుగోలుదారులు ఐక్యూ ఈ-స్టోర్, అమెజాన్, వివో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. మిడ్‌నైట్ బ్లూ, సోలార్ ఫ్లేమ్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
ఐక్యూ జెడ్11 లైట్ 5జీ- ఫీచర్లు..
ఐక్యూ జెడ్11 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. కంటి రక్షణ కోసం 'TÜV Rheinland Low Blue Light' సర్టిఫికేషన్‌ను అందించారు. 6ఎన్ఎం ప్రాసెస్ ఆధారిత మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు LPDDR4X RAM, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌ను ఇచ్చారు. వర్చువల్ ర్యామ్ ద్వారా మరో 6GB వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ఓస్ 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
ఐక్యూ జెడ్11 లైట్ 5జీ- కెమెరా సెటప్..
ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 50-మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్852 ప్రైమరీ కెమెరాతో పాటు 0.08-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర 5-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. నైట్ మోడ్, పోర్ట్రెయిట్, పనోరమా, టైమ్-లాప్స్, స్లో మోషన్ వంటి విభిన్న కెమెరా మోడ్‌లు ఇందులో లభిస్తాయి.
ఐక్యూ జెడ్11 లైట్ 5జీ- బ్యాటరీ..
ఈ ఐక్యూ జెడ్11 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 6,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీ. దీనికి 44W ఫ్లాష్‌చార్జ్ సపోర్ట్‌తో పాటు రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా కలదు. దుమ్ము, నీటి చుక్కల నుంచి రక్షణ కోసం ఐపీ65 రేటింగ్ ఇచ్చారు. భద్రత పరంగా సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఫోన్ మన్నిక కోసం మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో పాటు 'Swiss SGS Five-Star Drop Resistance' లభించింది. ఉచితంగా 'ఎయిర్స్ప్రింగ్' ప్రొటెక్టివ్ కేస్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


