శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఉదయం నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ62 మిషన్‌పై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే.. ఉపగ్రహాల నుంచి కీలకమైన టెలిమెట్రీ డేటా అందడం లేదని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. మూడో దశలో డీవియేషన్ కనిపించిందని, డేటాలను ఎనలైజ్ చేస్తున్నామని వివరించారు. దీనివల్ల అసలు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయా లేదా అన్నది ఇప్పటికీ సందిగ్ధంగానే మారింది.
ఇస్రో పీఎస్‌ఎల్వీ-సీ62.. అసలేం జరిగింది?

నిర్ణీత సమయం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల 18 నిమిషాలకు శ్రీహరికోట వేదికగా మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఇందులో 'అన్వేష' (ఈఓఎస్-ఎన్1) భూ పరిశీలన ఉపగ్రహంతో పాటు మరో 14 చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి. అయితే ప్రయోగం ముగిసిన తర్వాత శాస్త్రవేత్తల ముఖాల్లో ఆనందం కంటే ఆందోళనే ఎక్కువగా కనిపించింది. మిషన్ ఫలితం గురించి అప్పుడే ఏమీ చెప్పలేమని ఇస్రో సంకేతాలిచ్చింది.
పీఎస్‌ఎల్వీ- సీ62 లాంచ్‌కి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి:
ప్రస్తుత పరిస్థితిపై ఇస్రో ఒక సంక్షిప్త ప్రకటన చేస్తూ.. "ఈరోజు మేము పీఎస్‌ఎల్వీ-సీ62 మిషన్‌ను ప్రయోగించాం. ప్రస్తుతం ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని (డేటా) విశ్లేషిస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాము," అని పేర్కొన్నారు.
అందని సమాచారం.. ఎక్కడ పొరపాటు?
{{/usCountry}}ప్రస్తుత పరిస్థితిపై ఇస్రో ఒక సంక్షిప్త ప్రకటన చేస్తూ.. "ఈరోజు మేము పీఎస్‌ఎల్వీ-సీ62 మిషన్‌ను ప్రయోగించాం. ప్రస్తుతం ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని (డేటా) విశ్లేషిస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాము," అని పేర్కొన్నారు.
అందని సమాచారం.. ఎక్కడ పొరపాటు?
{{/usCountry}}సాధారణంగా రాకెట్ నుంచి ఉపగ్రహాలు విడిపోయి నిర్ణీత కక్ష్యలోకి చేరినప్పుడు గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందుతాయి. దీనినే 'టెలిమెట్రీ డేటా' అంటారు. అయితే ఈసారి ఆ సమాచారం అందకపోవడంతోనే సమస్య మొదలైంది. పీఎస్‌ఎల్వీ-సీ62 మోసుకెళ్లిన 15 ఉపగ్రహాలు వాటి నిర్దేశిత 'పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్'లోకి చేరాయా లేదా అన్నది ధృవీకరించడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇస్రో ప్రతిష్టకు సవాల్‌గా మారిన మిషన్!
2026 సంవత్సరంలో భారత్ చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే. 2025లో చేపట్టిన ఓ పీఎస్‌ఎల్వీ మిషన్ కూడా సాంకేతిక కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయింది. ఆ చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తూ ఈ 64వ ప్రయోగంతో ఘనంగా కమ్‌బ్యాక్ చేయాలని ఇస్రో భావించింది.
ఈ మిషన్‌లో ఇస్రో వాణిజ్య విభాగం 'న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్' (ఎన్ఎస్ఐఎల్) ద్వారా స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను పంపడంతో పాటు.. స్పెయిన్‌కు చెందిన స్టార్టప్ రూపొందించిన చిన్న రీ-ఎంట్రీ క్యాప్సూల్‌ను కూడా ప్రయోగాత్మకంగా పరీక్షించాల్సి ఉంది.
ఫ్లైట్ డేటాపై పూర్తిస్థాయి విశ్లేషణ ముగిసిన తర్వాతే ఈ మిషన్ భవితవ్యంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కోట్లాది మంది భారతీయులు ఇప్పుడు ఇస్రో నుంచి వచ్చే ఆ ఒక్క శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.