7000ఎంఏహెచ్​ బ్యాటరీతో OnePlus 15- లాంచ్​ డేట్​ ఇదే! ఇట్స్​ అఫీషియల్​..

OnePlus 15 లాంచ్ డేట్ ఖరారైంది! అక్టోబర్ 27న ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్​ఫోన్ విడుదలకానుంది. దీనితో పాటు వన్​ప్లస్​ ఏస్​ 6 స్మార్ట్​ఫోన్​ కూడా విడుదల అవుతుందని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Oct 17, 2025, 11:26:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మచ్​ అవైటెడ్​ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్​ప్లస్ 15 లాంచ్​ డేట్​ని సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ వన్​ప్లస్ హ్యాండ్‌సెట్ అక్టోబర్ నెలాఖరులో చైనాలో అడుగుపెట్టనుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్​ఫోన్‌తో పాటు మరో హై-పెర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్ వన్​ప్లస్ ఏస్ 6 కూడా మార్కెట్‌లోకి వస్తుంది. ఈ ఫోన్‌ల పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా రహస్యంగానే ఉన్నప్పటికీ.. చైనాలోని ఆన్‌లైన్ స్టోర్‌లలో వీటిని లిస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రీ-రిజర్వేషన్ల కోసం ఈ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.

త్వరలోనే వన్​ప్లస్​ 15 లాంచ్​..
త్వరలోనే వన్​ప్లస్​ 15 లాంచ్​..

వన్​ప్లస్​ 15 విడుదల తేదీ, సమయం..

చైనా సోషల్​ మీడియా వీబోలో చేసిన ఒక పోస్ట్‌లో, వన్​ప్లస్ సంస్థ వన్​ప్లస్​ 15ను అక్టోబర్ 27వ తేదీన.. చైనా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు (భారతదేశంలో సాయంత్రం 4:30 గంటలకు) విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఈ ఫోన్‌తో పాటు వన్​ప్లస్ సంస్థ ఇప్పటివరకు వివరాలు వెల్లడించకుండా దాచి ఉంచిన వన్​ప్లస్​ ఏస్​ 6 కూడా లాంచ్ అవుతుంది.

త్వరలో రాబోయే ఏస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్​ లుక్​ని కూడా వెల్లడించింది సంస్థ.

వన్​ప్లస్​ ఏస్​ 6 హ్యాండ్‌సెట్‌లో వన్​ప్లస్​ 15 మాదిరిగానే కెమెరా డిజైన్ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే 15లో మూడు సెన్సార్లకు బదులుగా ఇందులో రెండు సెన్సార్లు మాత్రమే ఉన్నాయి.

ఈ హ్యాండ్‌సెట్ రెండు రంగుల్లో లభిస్తుంది. సిల్వర్ వేరియంట్‌ వెనుక భాగంలో 'ఏస్​' బ్రాండింగ్‌ను కలిగి ఉంది. మరొకటి గోల్డెన్ షేడ్‌లో ఉంది. ఇది మరింత సున్నితంగా కనిపిస్తుంది.

వన్​ప్లస్​ 15, వన్​ప్లస్​ ఏస్​ 6 రెండూ ఒప్పో ఈ స్టోర్​, JD.com, ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రీ-రిజర్వేషన్ కోసం లిస్ట్ అయ్యాయి. అక్టోబర్ 27న లాంచ్ అయిన తర్వాత ఇవి అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.

వన్​ప్లస్​ 15, వన్​ప్లస్​ ఏస్​ 6 స్పెసిఫికేషన్స్ (అంచనా)..

వన్​ప్లస్​ 15 స్మార్ట్​ఫోన్​ క్వాల్కమ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వస్తుంది. డిస్‌ప్లే పరంగా కూడా అప్‌గ్రేడ్ ఉంటుందని, రిఫ్రెష్ రేట్ 165హెచ్​జెడ్​కు పెంచినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​ 165హెచ్​జెడ్​ 1.5కే ఓఎల్​ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 7000ఎంఏహెచ్​ సామర్థ్యం గల భారీ బ్యాటరీతో రావడం ఖాయమైంది.

ఫాస్ట్ ఛార్జింగ్: ఈ బ్యాటరీకి 100డబ్ల్యూ వైర్డ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

వన్​ప్లస్​ ఏస్​ 6 విషయానికొస్తే.. ఇందులో 1.5కే బీఓఈ ఓఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. ఇందులో అల్ట్రాసానిక్​ ఇన్​-డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ స్కానర్​ ఉండే అవకాశం ఉంది. పవర్​ఫుల్​ స్నాప్​డ్రాగన్​ 8 ఇలైట్​ ప్రాసెసర్​ మీద ఇది పనిచేస్తుంది. 7800ఎంఏహెచ్​ బ్యాటరీపై ఇది పనిచేస్తుందని సమాచారం. 120డబ్ల్యూ వయర్డ్​ ఫాస్ట్​ ఛార్జింగ్​కి ఇది సపోర్ట్​ చేస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More