Top NITs in India : దేశంలో టాప్​-10 ఎన్​ఐటీలు ఇవి..

JEE Mains 2026 : ఎన్​ఐఆర్​ఎఫ్​ 2025 ర్యాంకింగ్స్​ ప్రకారం దేశంలోని టాప్​- 10 ఎన్​ఐటీల జాబితా ఇక్కడ ఉంది. ఐఐటీల తర్వాత ఎన్​ఐటీలు చాలా కీలకంగా మారాయి. పూర్తి వివరాలు..

Published on: Apr 13, 2026, 05:27:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

NIRF ranking Top NITS : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 11న జేఈఈ మెయిన్స్ సెషన్-2 ప్రాథమిక కీని అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్, ఆన్సర్ కీ పీడీఎఫ్‌లను డౌన్​లోడ్ చేసుకుని, తమకు వచ్చే రా-స్కోరును ఇప్పుడే అంచనా వేసుకోవచ్చు. సెషన్-2 ఫలితాలతో పాటే ఎన్టీఏ ఆల్ ఇండియా ర్యాంకులను (ఎఐఆర్) కూడా ప్రకటించనుంది. కేవలం ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకే కాకుండా, ఐఐటీల్లో సీటు దక్కించుకోవడానికి రాసే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించాలన్నా ఈ మెయిన్ స్కోరు ప్రామాణికం.

దేశంలో టాప్​ 10 ఎన్​ఐటీలు..
దేశంలో టాప్​ 10 ఎన్​ఐటీలు..

ఎన్​ఐటీ కాలేజీల ప్రాముఖ్యత..

దేశంలో ఐఐటీల తర్వాత అత్యున్నత స్థాయి సాంకేతిక విద్యను అందించేవి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్​ఐటీ) సంస్థలే. ఇవి కేంద్ర విద్యాశాఖ పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన జాతీయ ప్రాముఖ్యత గల సంస్థలు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ముఖ్యంగా వరంగల్ ఎన్​ఐటీకి మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే గతేడాది విడుదలైన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్​ఐఆర్​ఎఫ్) 2025 ప్రకారం దేశంలోని టాప్-10 నిట్ కాలేజీల వివరాలు ఇక్కడ చూడొచ్చు.

దేశంలోని టాప్-10 ఎన్ఐటీల జాబితా (ఎన్​ఐఆర్​ఎఫ్ 2025)..

భారత ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల ప్రకారం మేటి సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి:

ఎన్ఐటీ తిరుచిరాపల్లి (తమిళనాడు): ఓవరాల్ ఇంజనీరింగ్ విభాగంలో 9వ ర్యాంకుతో దేశంలోనే నంబర్ వన్ నిట్‌గా నిలిచింది.

ఎన్ఐటీ రూర్కెలా (ఒడిశా): ఇది 13వ ర్యాంకుతో రెండో స్థానంలో ఉంది.

ఎన్ఐటీ కర్ణాటక, సూరత్కల్: 17వ ర్యాంకుతో దక్షిణాదిలో మరో టాప్ కాలేజీగా కొనసాగుతోంది.

ఎన్ఐటీ కాలికట్ (కేరళ): దీనికి 21వ ర్యాంకు లభించింది.

ఎన్ఐటీ వరంగల్ (తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లోనే తలమానికమైన ఈ సంస్థ 28వ ర్యాంకును కైవసం చేసుకుంది.

ఎంఎన్ఐటీ జైపూర్ (రాజస్థాన్): 42వ ర్యాంకు.

వీఎన్ఐటీ నాగపూర్ (మహారాష్ట్ర): 44వ ర్యాంకు.

ఎన్ఐటీ దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్): 49వ ర్యాంకు.

ఎన్ఐటీ సిల్చార్ (అసోం): 50వ ర్యాంకు.

ఎన్ఐటీ పాట్నా (బీహార్): టాప్ 10 జాబితాలో నిలిచింది.

కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది?

జేఈఈ మెయిన్స్ ఫలితాలు వెల్లడైన తర్వాత, జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) ద్వారా సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్టీఏ నిర్ణయించిన కనీస క్వాలిఫైయింగ్ మార్కులు సాధించిన విద్యార్థులు మాత్రమే ఈ జోసా కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు సాధించిన ర్యాంకులను బట్టి వివిధ కాలేజీల్లో ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది.

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు హోమ్ స్టేట్ కోటా కింద వరంగల్ ఎన్​ఐటీ లేదా ఏపీలోని తాడేపల్లిగూడెం ఎన్​ఐటీలో సీటు పొందే అవకాశం ఉంటుంది. అయితే టాప్ ర్యాంకర్లు మాత్రం తిరుచిరాపల్లి లేదా సూరత్కల్ వంటి జాతీయ స్థాయి మేటి సంస్థలపై కన్నేస్తుంటారు.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ ద్వారా నా ర్యాంకును తెలుసుకోవచ్చా?

లేదు, ఆన్సర్ కీ ద్వారా మీరు పరీక్షలో సాధించే స్కోరును మాత్రమే లెక్కించగలరు. ఎన్టీఏ రెండు సెషన్ల ఫలితాలను నార్మలైజ్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్ ర్యాంకులను వెల్లడిస్తుంది.

2. క్వాలిఫైయింగ్ మార్కులు సాధిస్తే నిట్‌లో సీటు వస్తుందా?

క్వాలిఫైయింగ్ మార్కులు కేవలం జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు లేదా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఒక అర్హత మాత్రమే. టాప్ నిట్లలో సీటు రావాలంటే మీ ర్యాంకు మెరుగ్గా ఉండాలి.

3. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ మెయిన్స్ సరిపోతుందా?

లేదు. ఐఐటీల్లో సీటు కావాలంటే జేఈఈ మెయిన్స్​లో టాప్ 2.5 లక్షల ర్యాంకర్లలో నిలిచి, ఆ తర్వాత నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో కూడా మెరుగైన ర్యాంకు సాధించాలి.

4. జోసా కౌన్సెలింగ్ ఎప్పుడు మొదలవుతుంది?

సాధారణంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడైన తర్వాత జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలవుతుంది. ఇది జూన్ లేదా జూలై నెలలో ఉండవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More